
ఆదిత్యా ఓం, స్వాతి
ఆదిత్యా ఓం, స్వాతి టండన్ జంటగా హరిచందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న త్రిభాషా చిత్రం ‘యంగ్ స్టార్స్’. రాధా వైష్ణవ్ లక్ష్మీ నారాయణ ప్రొడక్షన్ పతాకంపై వైష్ణవ్ లక్ష్మీ నారాయణ , ఔరంగజేబ్, వినోద్ పార్వతి, మురళి కృష్ణ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ – ‘‘స్నేహం, ప్రేమ అనే రిలేషన్స్ యువతరం జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి, ఎలాంటి అలజడులను సృష్టిస్తున్నాయి అనే కాన్సెప్ట్‌తో యంగ్‌స్టార్స్ తెరకెక్కిస్తున్నాం. వైజాగ్. అరకు, ముంబై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించి దసరాకు ఈ సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘సినిమాలో మరో జంటను, ఇంకొంత మంది ఆర్టిస్టులను త్వరలో అనౌన్స్ చేస్తాం. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత, కెమెరామేన్ లక్ష్మీనారాయణ. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్.జి, ఫైట్స్: పి.సతీష్ మాస్టర్.
Comments
Please login to add a commentAdd a comment