ఆదిత్య ఓం.. పుట్టింది కాశీలో, పెరిగింది ఉత్తరప్రదేశ్‌లో! సినిమా పిచ్చితో ముంబైలో అడుగుపెట్టాడు. వైవీఎస్ చౌదరితో ఏర్పడిన పరిచయంతో లాహిరి లాహిరి లాహిరిలో సినిమా చేశాడు. ఈ చిత్రంతోనే తెలుగు వారికి పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ అందుకున్నాడు. తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యాక్ట్ చేశాడు. హీరోగానే కాకుండా విలన్‌గానూ తన టాలెంట్ చూపించాడు.
ఒకప్పుడు టాప్ హీరోగా వెలుగొందిన అతడు తర్వాత బోలెడన్ని సినిమాలు చేశాడు. కానీ, అవేవీ పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. సినిమాలు లేని టైంలో డిప్రెషన్‌కు వెళ్లిపోయాడు. రోజుకు దాదాపు 60 సిగరెట్లు తాగాడు. తన గది దాటి బయటకు రాలేకపోయాడు. కానీ కుటుంబం అందించిన సపోర్ట్ వల్ల నెమ్మదిగా ఆ మానసిక ఒత్తిడి నుంచి కోలుకున్నాడు. 2010లో ముంబై వెళ్లి ప్రొడక్షన్ మేనేజర్‌గా మళ్లీ కెరీర్ మొదలుపెట్టాడు. దర్శకనిర్మాతగా చిత్రాలు తెరకెక్కించాడు.
ఇతడు రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా! ఆ మధ్య భద్రాద్రి కొత్తగూడెంలోని రెండు గ్రామాలను దత్తత తీసుకుని దాదాపు 500 మందికి సాయం చేశాడు. అలాగే అక్కడ పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాడు. సేవాగుణం మెండుగా ఉన్న ఆదిత్య బిగ్‌బాస్ షోతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూశాడు. కానీ ఐదో వారం మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment