Bigg Boss 8: సోనియా ఎలిమినేట్‌.. ఖుషీలో నిఖిల్‌ ఫ్యాన్స్‌ | Bigg Boss Telugu 8: Is Sonia Akula Went to Secret Room | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: సోనియా ఎలిమినేట్‌.. సీక్రెట్‌ రూంలాంటి ట్విస్టులేమైనా..?

Published Sat, Sep 28 2024 4:27 PM | Last Updated on Sat, Sep 28 2024 6:55 PM

Bigg Boss Telugu 8: Is Sonia Akula Went to Secret Room

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో అడుగుపెట్టిందే 14 మంది కంటెస్టెంట్లు.. అందులో బేబక్క, శేఖర్‌ బాషా, అభయ్‌ నవీన్‌ వరుసగా ఎలిమినేట్‌ అయ్యారు. ఈ మూడువారాలు అందరూ ఊహించి కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అవగా నాలుగోవారం మాత్రం ప్రేక్షకులు కోరుకున్న వ్యక్తి హౌస్‌ నుంచి బయటకు వచ్చేస్తున్నారట!

సోనియాకే తక్కువ ఓట్లు
ఈ వారం ఆదిత్య ఓం, సోనియా ఆకుల, పృథ్వీ శెట్టి, ప్రేరణ, నబీల్‌, నాగమణికంఠ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో పృథ్వి, ఆదిత్య, సోనియాకు తక్కువ ఓట్లు వచ్చినట్లు భోగట్టా! ఈ ముగ్గురిలో కూడా సోనియాకే అత్యంత తక్కువ ఓట్లు పడ్డాయి. సోనియా తానే పెద్ద తోపు అని ఫీలవ్వడమే కాక నిఖిల్‌, పృథ్వీలను తన చేతివేళ్లపై ఆడిస్తోంది. ఈ టాలెంట్‌ నచ్చకనే ఆపరేషన్‌ సోనియా పేరిట తనను ఎలిమినేట్‌ చేయాలని ప్రేక్షకులు కంకణం కట్టుకున్నారు.

సీక్రెట్‌ రూమ్‌?
అయితే తనవల్ల అంతోఇంతో కంటెంట్‌ వస్తోంది కాబట్టి ఆమెను పంపించేందుకు బిగ్‌బాస్‌ టీమ్‌ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ చివరికి తనను ఎలిమినేట్‌ చేశారట! ఎలిమినేట్‌ చేసినట్లే చేసి సీక్రెట్‌ రూమ్‌లోకి పంపించే ఆస్కారం కూడా ఉంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలతో పాటు తిరిగి తనను హౌస్‌లోకి అడుపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు!

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement