
ఆదిత్య ఓం
‘లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మీ ఐ లవ్‌యూ, మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు, ఫ్రెండ్ రిక్వెస్ట్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు నటుడు ఆదిత్య ఓం. ఆయన ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందనుంది. అందులో విశేషం ఏంటంటే... ఈ సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్రతో ఉంటుంది. వినూత్న కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రాఘవ తిరువాయిపాటి దర్శకత్వం వహించనున్నారు. ఎమినెంట్ 5ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే నూతన సంస్థ ఎస్.ఆర్. ప్రొడక్షన్ సమర్పణలో రూపొందించనున్న ఈ సినిమా ఈ నెలాఖరు నుంచి షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: రాకేష్ గోవర్ధన్ గిరి, కెమెరా: మధుసూదన్ కోట.
Comments
Please login to add a commentAdd a comment