
చేసేదంతా చేస్తారు.. అంతా అయిపోయాక మాత్రం తన ఉద్దేశం అది కాదని యూటర్న్ తీసుకుంటారు. సోనియా, యష్మి, తేజ, విష్ణుప్రియ, ప్రేరణ, నాగమణికంఠ.. ఇలా బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో చాలామంది ఇదే కోవలోకి వస్తారు. ఈవారం పృథ్వీ.. రోహిణిని కింది నుంచి పైకి చూస్తూ చులకనగా మాట్లాడాడు.. దీని గురించి నాగ్ ప్రస్తావించగా బాడీ షేమింగ్ చేయాలన్న ఉద్దేశం తనది కాదని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో నాగ్ క్లాస్ పీకాడు. ఇక యష్మి ఇండివిడ్యువల్ గేమ్ కనిపించడం లేదంటూ ఆమె ఫోటో ఉన్న కుండ పగలగొట్టాడు.

స్పెషల్ గెస్ట్‌గా సూర్య
ఇకపోతే ఈరోజు ఎపిసోడ్‌లో హీరో సూర్య అతిథిగా విచ్చేయనున్నాడు. కంగువా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్టేజీపైకి వచ్చాడు. అతడిని చూసి సూర్య అభిమానురాలు నయని పావని తెగ సంతోషపడిపోయింది. అతడి కోసం 5 నిమిషాలు హౌస్‌లో నుంచి బయటకు వస్తావా? అంటే వచ్చేస్తానని తలూపింది. మళ్లీ హౌస్‌లోకి పంపించను అని నాగ్ తిరకాసు పెట్టినప్పటికీ సూర్య కోసం బయటకు వచ్చేందుకు రెడీ అని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment