బిగ్‌బాస్ 7వ సీజన్ నుంచి ఆరోవారం ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో భాగంగా హౌసులోకి అడుగుపెట్టిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నయని పావని.. వచ్చిన వారంలో తన ఆటతో ఆకట్టుకుంది. కానీ అనుకోని విధంగా బయటకొచ్చేసింది. మరీ వారంలో ఆమె ఎంత సంపాదించిందో తెలుసా?
బిగ్‌బాస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పలేం. నామినేషన్స్ నుంచి ఎలిమినేషన్స్ వరకు కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలా ఈ వారం ఏడుగురు నామినేట్ అయ్యారు. రెండు రోజులు ముందు వరకు ఓటింగ్ పరంగా చూసుకుంటే శోభాశెట్టి, పూజామూర్తి, నయని పావని చివరి స్థానాల్లో ఉన్నారు.
(ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' రతిక)
వీళ్లలో చాలామంది శోభాశెట్టి లేదా పూజామూర్తి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ వీళ్లిద్దరూ కాకుండా నయని పావని ఎలిమినేట్ అయిపోయింది. అయితే గేమ్, టాస్కుల పరంగా ఈమెకి బలం ఉంది. ఇంకో రెండు-మూడు వారాలు ఉండుంటే రేసులో ఉండేదేమో. కానీ పరిస్థితులు అనుకూలించక.. వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది.
ఇకపోతే వారానికి రూ.2 లక్షలకు నయని పావని అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే వచ్చిన వారం మాత్రమే ఉంది కాబట్టి కేవలం రూ.2 లక్షలు తీసుకునే ఇంటికి వెళ్లిపోనుంది. సో అదన్నమాట విషయం.
(ఇదీ చదవండి: గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment