బిగ్ బాస్ సీజన్-7 నుంచి ఆరోవారం నయని పావని ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టిన పావని ఒక వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. సాధారణంగా ఈ షోను అందరూ ఎంటర్‌టైన్‌మెంట్ షో మాదిరే చూస్తారు. కానీ నయని పావని ఎలిమినేట్ అయిన తీరును చూసిన మెజారిటీ ప్రేక్షకులు కన్నీరు పెట్టుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హౌస్‌లోని సభ్యులతో పాటు ప్రేక్షకుల గుండెను ఆమె కన్నీళ్లు తాకాయి. చివరకు ఎంతో గొప్ప యాక్టర్, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా తొలిసారి ఎమోషనల్ అయ్యాడు.
నయని పావని స్టేజీపైన మాట్లుడుతున్న సమయంలో ఆమె కంట వస్తున్న కన్నీరు మెడ భాగం వరకు పోతూనే ఉంటాయి. ఆ దృశ్యాలను చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఎమోషనల్ అయ్యాడు అని చెప్పవచ్చు. కొద్దిరోజుల క్రిత్రం నయని పావని తండ్రి మరణించారని విషయం తెలిసిందే. అందుకే ఆమె శివాజీని నాన్న అంటూ పిలుస్తూ ఉండేది. స్టేజీపైన శివాజీని డాడీ అంటూ అలా ఉండిపోయిన ఆమె కోసం హౌస్ నుంచి తాను వెళ్లిపోతానని అవకాశం ఉంటే నయని పావనిని హౌస్‌లో ఉంచండని శివాజీ కోరుతాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి శివాజీ ఔట్.. మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా?)
అందుకు నాగార్జున అవకాశం లేదు.. అది ప్రేక్షకుల నిర్ణయం అంటాడు. ఆమె హౌస్ నుంచి వెళ్తున్న సమయంలో మొదటిసారి శివాజీ కూడా పావని కోసం గేట్ క్లోజ్ అయ్యే వరకు అక్కడే ఉన్నాడు. అలా ఆమె హౌస్‌లో ఉన్న వారందరిని మెప్పించింది. ఒక రకంగా ఆదివారం ఎపిసోడ్ నయని పావని వల్ల బిగ్ బాస్ ప్రేక్షకుల హర్ట్ మెల్ట్ అయిందని చెప్పవచ్చు.
ఎలిమినేట్‌కు కారణాలు ఇవే
నయని పావనికి ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్‌లలో నటించి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఆమె హౌస్‌లోకి వెళ్తున్న సమయంలో పీఆర్ టీమ్‌ను ఏర్పాటు చేసుకోకుండా వెళ్లడం ప్రధాన కారణం అని తెలుస్తోంది. రీ ఎంట్రీ ఇచ్చిన వారందరిలో ఆమె బెటర్ అనేలా గేమ్ ప్లే చేసింది. ఈ వారంలో ఆమెపై ఎక్కడా నెగటివ్ రాలేదు. శివాజీతో ఆమెకు మంచి బాండింగ్ ఉంది. అలాగే పల్లవి ప్రశాంత్‌తో ఆమె క్లోజ్‌గా ఉంది. యావర్ ఆమె వల్లే హౌస్ కెప్టెన్ అయ్యాడు. ఈ ముగ్గురికి ఉన్న ఓట్ బ్యాంక్ ఆమె వైపు వెళ్లలేదు. దీనికి ప్రధాన కారణం ఆమెకు పీఆర్ టీమ్ లేకపోవడం అని చెప్పవచ్చు. అంతకు మించి ఆమెపై ప్రేక్షకుల్లో ఎలాంటి నెగటివిటీ లేదు.
నయని పావని రీ ఎంట్రీ.. అవకాశాలు తక్కువే
నయని పావని రీ ఎంట్రీ ఉంటే బాగుంటుంది అని ప్రతి బిగ్ బాస్ ప్రేక్షకుడు అనుకుంటున్నాడు. ఆ మేరకు ఇప్పటికే పలువురు ఆమె రీ ఎంట్రీ కోసం సోషల్ మీడియాలతో పాటు స్టార్ మా యూట్యూబ్ వీడియోల కింద మెసేజ్‌లు చేస్తున్నారు. కానీ బిగ్‌బాస్ ఆమెకు రీ ఎంట్రీ అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. ఎందకంటే నయని పావని ఎలిమినేషన్ ఎపిసోడ్‌తో భారీ గుర్తింపు వచ్చింది. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే ఆ ఇమేజ్ కోల్పోయే ఛాన్స్ ఉంది.
దీంతో ప్రస్తుతానికి రీ ఎంట్రీ ఆప్షన్ ఇవ్వకుండా... త్వరలో రాబోయే బిగ్‌బాస్ OTT కోసం ఆమెను ఉపయోగించుకునే అవకాశమే ఎక్కువ ఉంది. దీనికి ప్రధాన కారణం ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్. దీంతో ఆమెను OTT సీజన్ కోసం ఉపయోగించుకుంటే షో రేటింగ్ మరింతే పెరిగే ఛాన్స్ ఉంటుందని బిగ్‌బాస్ టీమ్ ఆలోచిస్తుందట. ఇదే నిజమైతే OTT సీజన్‌లో ఆమె టైటిల్ రేసులో నిలవడం ఖాయం. ఏదేమైనా నయని పావని రీ ఎంట్రీ అవకాశాలు చాలా తక్కువ. ఇందులో సందేహమే లేదు.
(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి)
Comments
Please login to add a commentAdd a comment