రోహిణిని టార్గెట్‌ చేసిన లవ్‌ బర్డ్స్‌.. కొత్త మెగా చీఫ్‌ ఎవరంటే? | Bigg Boss Telugu 8: Vishnu Priya Targets Rohini In Mega Chief Selection Task, Nayani Pavani Gets Emotional | Sakshi
Sakshi News home page

నామినేట్‌ చేసిందని రోహిణిపై పగ తీర్చుకున్న విష్ణు... మళ్లీ శోకమందుకున్న నయని

Published Fri, Oct 11 2024 6:44 PM | Last Updated on Fri, Oct 11 2024 6:59 PM

Bigg Boss Telugu 8: Vishnu Priya Targets Rohini in Mega Chief Selection Task

సీత ఊరికనే ఏడవడం నచ్చలేదని నామినేట్‌ చేసిన నయని.. ఇప్పుడు చేస్తుందేంటో? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇకపోతే

బిగ్‌బాస్‌ హౌస్‌లో మెగా చీఫ్‌ కోసం మొదటి పోటీ జరిగింది. ఇందులో అవినాష్‌, రోహిణి, మెహబూబ్‌, మణికంఠ, గౌతమ్‌, హరితేజ, నయని పావని పాల్గొన్నారు. అయితే ప్రేమపక్షులు విష్ణుప్రియ- పృథ్వీ.. రోహిణిని టార్గెట్‌ చేసినట్లున్నారు. ఇక పృథ్వీ అయితే ఏకంగా తలకు గురి పెట్టి విసిరాడు. అవి తన కళ్లకు తగులుతుండటంతో రోహిణి ఫైర్‌ అయింది. 

దాడి చేశాక సారీ దేనికి?
బాడీపై విసురు, కానీ కళ్లపై కొట్టవద్దని అరిచింది. ఒక్కరిపైనే దాడి చేసి తర్వాత సారీ చెప్పేస్తే నాకెలా అనిపిస్తుంది? అని రోహిణి బాధపడింది. అటు విష్ణుప్రియ.. మరి తను వచ్చీరాగానే నన్ను నామినేట్‌ చేసింది.. నాకెలా అనిపిస్తుంది? అయినా ఐ లవ్యూ చెప్తున్నాగా.. అని అభిప్రాయపడింది. 

ఏడుపందుకున్న నయని
ఇక నయని పావని మరోసారి కన్నీటి కుళాయి ఓపెన్‌ చేసింది. నన్ను టాప్‌2లో తీసుకోలేదు, ముందే అవుట్‌ చేద్దామని మా టీమ్‌ డిసైడయ్యారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సీత ఊరికనే ఏడవడం నచ్చలేదని నామినేట్‌ చేసిన నయని.. ఇప్పుడు చేస్తుందేంటో? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇకపోతే ఈవారం నామినేషన్స్‌లో ఉన్న మెహబూబ్‌ మెగా చీఫ్‌గా గెలిచాడని సమాచారం.

చదవండి: తనలో సడన్‌ మార్పు, చాలా సెల్ఫిష్‌.. ఇప్పటికీ చెప్తున్నా విష్ణు ఫేక్‌ ఫ్రెండ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement