బిగ్‌బాస్‌ 8: నయని సేఫ్‌, మెహబూబ్‌ ఎలిమినేట్‌! | Bigg Boss Telugu 8: Buzz, Nayani Pavani Eliminated from 8th Week | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌కు మెహబూబ్‌ గుడ్‌బై.. అదే ప్రధాన కారణం!

Oct 26 2024 8:02 PM | Updated on Oct 26 2024 9:06 PM

Bigg Boss Telugu 8: Buzz, Nayani Pavani Eliminated from 8th Week

బిగ్‌బాస్‌ హౌస్‌లో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్టుగా ఎంట్రీ ఇచ్చేవారెప్పుడూ డేంజర్‌ జోన్‌లోనే ఉంటారు. ఎందుకంటే పాత కంటెస్టెంట్లపై జనాలకు ఓ అవగాహన ఉంటుంది. వారి బలాలు, బలహీనతలు.. ప్రతీది తెలుసు. పైగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఫ్యాన్‌ బేస్‌లు కూడా ఏర్పడుతుంటాయి. కానీ సడన్‌గా వైల్డ్‌ కార్డ్స్‌ దిగితే.. వీరు సత్తా చూపించినా సరే పాత కంటెస్టెంట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపిస్తారు. 

డేంజర్‌ జోన్‌లో వైల్డ్‌ కార్డ్స్‌
అలాంటిది పర్ఫామెన్స్‌ ఏమాత్రం బెడిట్టినా ఎలిమినేషన్‌ అనే వాకిట్లో నిలబెట్టేస్తారు. ఈసారీ అదే జరిగింది. ఈ వారం విష్ణుప్రియ, పృథ్వీ, ప్రేరణ, నిఖిల్‌, మెహబూబ్‌, నయని పావని నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో మెగా చీఫ్‌గా ఫెయిలైన మెహబూబ్‌, టాస్కులో పెద్దగా కనిపించని నయని డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. ఇప్పటికే సండే ఎపిసోడ్‌ షూటింగ్‌ పూర్తవగా.. నయని పావనిని ఎలిమినేట్‌ చేేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయినట్లు మరో వార్త వైరలవుతోంది. కమ్యూనిటీ ఓట్లు మనకు గట్టిగా పడతాయి అన్న మాటే అతడి ఎలిమినేషన్‌కు ప్రధాన కారణంగా మారింది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement