
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ చూస్తుండగానే రెండు నెలలు గడిచిపోయాయి. వైల్డ్‌కార్డ్స్‌తో షోలో కాస్త వినోదాన్నయితే తీసుకొచ్చారు కానీ మరీ అంతగా రక్తి కట్టించలేకపోతున్నారు. హౌస్‌లో కంటెస్టెంట్ల ఆట, మాట చూస్తుంటే వరుసగా వైల్డ్‌కార్డ్సే తట్టాబుట్టా సర్దుకునేలా ఉన్నారు.

నామినేషన్స్‌లో ఐదుగురు
ఈ తొమ్మిదోవారం తేజ, యష్మి, నయని పావని, హరితేజ, గౌతమ్ నామినేషన్స్‌లో ఉన్నారు. శక్తికి మించి ఆడిన తేజ అందరికన్నా ముందు సేవ్ అయిపోయాడు. యష్మికి ఆల్‌రెడీ ఫ్యాన్‌బేస్ ఉండటంతో పాటు తన టీమ్ కోసం నిఖిల్‌నే ఎదిరించడం ప్లస్ అయింది. అలా తనకు బాగానే ఓట్లు పడ్డాయి. గౌతమ్ కూడా తన శక్తి మేర ఆడుతున్నందున అతడు సైతం ఓటింగ్‌లో ముందువరుసలో ఉన్నాడు.

హరితేజకు పూనకం
మిగిలిందల్లా హరితేజ, నయని పావని. తమను ఎవరూ గుర్తించట్లేదని బాధపడుతున్న వీళ్లను నిజంగానే ప్రేక్షకులు కూడా గుర్తించడం లేదేమో! అందుకే ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉన్నారు. బీన్ బ్యాగు టాస్కులో హరితేజ పూనకం వచ్చినట్లుగా ఆడి మెప్పించింది.
ఆ కారణం వల్లే..
ఇక నయని పావని ఆటలో కన్నా ఎప్పుడూ ఏడుస్తూనే కనిపించడం జనాలకు చిరాకు తెప్పిస్తోంది. ఈ క్రైయింగ్ బేబీ మాకొద్దంటూ ఈ వారం ఆమెను పంపించేశారు. ఇప్పటికే సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా నయని పావనిని ఎలిమినేట్ చేసేశారట! చూస్తుంటే వైల్డ్‌కార్డులను బయటకు పంపించే ప్రక్రియ వచ్చేవారం కూడా కొనసాగేలా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment