
ఆవేశం అందరికీ వస్తుంది.. కానీ ఎంత ఆవేశం వచ్చినా, కోపమొచ్చినా మాట అదుపులో పెట్టుకోవాలి. ఒక్కసారి నోరు జారితే ఆ మాటను వెనక్కు తీసుకోలేం. ఈ విషయాన్ని నాగార్జున పృథ్వీకి ఎన్నోసార్లు చెప్పాడు. ఇప్పుడు పృథ్వీ బాగానే ఉన్నాడు కానీ మరో ఇద్దరికీ మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది.

ప్రేరణ, గౌతమ్‌లపై సీరియస్
తాజాగా రిలీజైన ప్రోమోలో నాగ్.. ప్రేరణ, గౌతమ్‌లపై సీరియస్ అయ్యాడు. పుడింగి ప్రేరణ.. అందరికీ మైండ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్తుంటావ్.. మరి నీ నోరు అదుపులో పెట్టుకున్నావా? అని అడిగాడు. నిఖిల్‌పై నోరు జారిన వీడియోను ప్లే చేసి ఇది కరెక్టేనా? అని అడిగాడు.

వీడియో ప్లే చేసి మరీ..
అటు నిఖిల్‌పైనా మండిపడ్డాడు. ఆటలో అంత అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరం లేదని చురకలంటించాడు. అటు గౌతమ్ నిఖిల్‌పై అరిచిన వీడియో ప్లే చేసి అక్కడ ఏం అన్నావ్? అని నిలదీశాడు. నేను ఏదో నసిగినట్లు పెదాలాడించానే తప్ప ఎలాంటి బూతు మాట్లాడలేదు అన్నాడు.

తల్లిపై ప్రమాణం
చాలా తెలివిగా వాడాల్సిన పదం వాడేశావ్ అని నాగ్ అనగా.. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా.. నేను నిజంగా అలా అన్నట్లు నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతానన్నాడు. అయితే అతడు ఏమీ అనలేదని నమ్ముతున్నారా? అని అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు స్టూడియోలో ఉన్న ప్రేక్షకులను అడగా ఏ ఒక్కరూ నమ్ముతున్నట్లు చెప్పలేదు. దీంతో గౌతమ్ బిక్కముఖం వేశాడు.
Comments
Please login to add a commentAdd a comment