
బిగ్‌బాస్ 7 షోలో హౌస్‌మేట్లనే కాదు, ప్రేక్షకులను సైతం కంటతడి పెట్టించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? అంటే అది నయని పావని మాత్రమే! వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టింది నయని. ఆత్మస్థైరంతో ఆటలాడుతూ వారం రోజుల్లోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నిరూపించుకుంది. టాప్ 5లో ఉండాలని టార్గెట్ పెట్టుకుంది, కానీ వచ్చిన వారం రోజులకే ఎలిమినేట్ అయింది. దీంతో ఆమె ఎంతగానో ఏడ్చింది. హౌస్‌ను సైతం ఏడిపించేసింది.
తాజాగా బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొన్న నయని.. గీతూ రాయల్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తేజతో కావాలనే గొడవపడాలని ఫిక్సయ్యావనిపించింది అని గీతూ చెప్పగా అలా ఏం లేదని క్లారిటీ ఇచ్చింది నయని. నువ్వు కాకుండా ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నావు? అని ప్రశ్నించగా అశ్విని అని చెప్పింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ హౌస్‌లో నా గేమ్ నేను ఆడాను.. హౌస్‌లో శివాజీకి కనెక్ట్ అయ్యాను. నాకు తెలియకుండానే హౌస్‌మేట్స్‌తో కనెక్ట్ అయిపోయాను, వాళ్లు కూడా నాకు కనెక్ట్ అయిపోయారు' అని చెప్తూ ఏడ్చేసింది నయని పావని.
ఇప్పటికీ ఎలిమినేషన్ బాధలో నుంచి బయటపడలేకపోతుంది నయని. తను ఇంటికి వెళ్లగానే బిగ్‌బాస్ షోని తల్చుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. టాప్ 5లోకి వెళ్తాననుకున్నాను, కానీ ఇంత త్వరగా ఎలిమినేట్ అయిపోయాను, సారీ అమ్మా అంటూ ఏడ్చేసింది. కూతురికి హారతి ఇస్తూ ఆ తల్లి సైతం కంటతడి పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment