సమయం దొరికినప్పుడల్లా అవినాష్ అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. అటు తేజ, అవినాష్.. గంగవ్వను దెయ్యం పట్టినట్లు యాక్ట్ చేయమన్నారు. కానీ గంగవ్వ ఏకంగా జీవించేసింది. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
తిక్క కుదిర్చిన బిగ్‌బాస్
ఇంటిని శుభ్రంగా ఉంచట్లేదని, తన ఆదేశాలను లెక్కచేయట్లేదని బిగ్‌బాస్ హర్టయ్యాడు. అందుకని ఈ వారం సూపర్‌మార్కెట్‌లో షాపింగ్ చేసే సమయాన్ని కాస్త కట్ చేసిపారేశాడు. దీంతో మెగా చీఫ్ గౌతమ్.. నిఖిల్‌ను మార్కెట్‌కు పంపించి అతడితో షాపింగ్ చేయించాడు.
యష్మి- నిఖిల్ లవ్ ట్రాక్?
ఇక యష్మి.. నిఖిల్‌ను తనతో మాట్లాడమని బతిమాలింది. ఫ్రెండ్స్‌గా ఉన్నప్పుడే బాగుండేది.. నా వల్ల నీ గేమ్‌కు ప్రాబ్లం కానివ్వను. నాది పడిపడి చచ్చే క్యారెక్టర్ అయితే కాదు, ఇకపై జస్ట్ ఫ్రెండ్‌గా ఉంటా అని చెప్పుకుంటూ పోయింది. నిఖిల్ శిలావిగ్రహంలా స్తబ్దుగా కూర్చోవడంతో కోపంతో వెళ్లిపోయింది. ఆమె అలకను తీర్చేందుకు నిఖిల్.. యష్మిని హత్తుకుని ముద్దిచ్చాడు.
ఇంకా పృథ్వీ వెనకే పడుతోన్న విష్ణు
పృథ్వీ మెడలో గోల్డ్ చెయిన్ చూసి నిలువెత్తు బంగారం.. మళ్లీ బంగారం వేసుకుని తిరగడమేంటో అని మురిసిపోయింది. ఈ మాట విన్న హౌస్‌మేట్స్ ఇక మా వల్లకాదు, వెళ్లిపోతాం అని జోక్ చేశారు. బిగ్‌బాస్ కూడా సరే, మీ సరదా నేనెందుకు కాదంటాను అన్నట్లు గేట్లు తెరిచాడు. దీంతో అబ్బాయిలంతా కలిసి అవినాష్‌ను లాక్కెళ్లి మరీ బయట పడేసేందుకు ప్రయత్నించారు.
మనసు మార్చుకున్న బిగ్‌బాస్
అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ మేరకు అవినాష్ జిమ్ ట్రైనర్‌గా మారి హౌస్‌మేట్స్‌తో చిత్రవిచిత్రమైన కసరత్తులు చేయించి నవ్వించాడు. దీంతో కిచెన్ టైమర్‌కు మరో రెండు గంటల సమయం యాడ్ చేశాడు. అలాగే మార్కెట్‌లో మర్చిపోయిన కూరగాయలు, పండ్లను సైతం పంపించి తన మనసు వెన్న అని నిరూపించుకున్నాడు.
అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!
అవినాష్, తేజ.. గంగవ్వను దెయ్యంలా రెడీ అయి భయపెట్టాలన్నాడు. ఇంకేముంది.. అర్ధరాత్రి గంగవ్వ జుట్టు విరబోసుకుని కేకలు వేయడంతో హౌస్‌మేట్స్ నిద్రలో నుంచి లేచి జడుసుకున్నారు. ఇది చూసిన తేజ.. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ పక్కా అని భయపడిపోయాడు. నిఖిల్, పృథ్వీ, నబీల్ మాత్రం నిద్రలో నుంచి లేవలేదు. అయితే ఇది ప్రాంక్ అని, అవినాష్ చేయించి ఉంటాడని గౌతమ్ అనుమానపడ్డాడు.
మెగా చీఫ్ కంటెండర్‌గా రోహిణి
బీబీ రాజ్యం ఏర్పాటు చేసుకునేందుకు రెండు క్లాన్స్ పోటీపడతాయన్నాడు. మొదటగా అక్వేరియంలో నీళ్లను నింపే టాస్కులో రాయల్ టీమ్ గెలిచింది. అందుకు గానూ రాజ్యంలో మంచినీటి సరస్సును పొందారు. అలాగే రాయల్ టీమ్‌లో నుంచి రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అయింది. అలాగే ఓజీ టీమ్‌లో యష్మి మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పుకుంది. రోహిణిని కంటెండర్‌గా సెలక్ట్ చేయడంపై హరితేజ రాద్దాంతం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment