పదోవారం ముగింపులోకి వచ్చిన బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్పటికే పది మంది కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. సూర్యకిరణ్, కల్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్, సుజాత, కుమార్ సాయి, దివి, అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు. అనారోగ్య కారణాలతో గంగవ్వ, నోయల్ స్వతంత్రంగా హౌస్‌ను వీడి వచ్చేశారు. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది పక్కన పెట్టి అసలు ఎలిమినేషన్ ఉంటుందా? లేదా? అని అందరూ అయోమయంలో పడిపోయారు.
నామినేషన్‌లోకి వచ్చి బుక్కయ్యాడు
కానీ తాజాగా లీకువీరులు చెప్తున్న సమాచారం ప్రకారం ఎలిమినేషన్ ఎత్తేయలేదు. దీపావళి పండగను సాకుగా చెప్తూ అందరినీ సేఫ్ చేయలేదు. ముందు నుంచి ఊహిస్తున్నదాని ప్రకారం మెహబూబే ఈ వారం ఎలిమినేట్ అయ్యాడని వినికిడి. నిజానికి ఎప్పుడో బ్యాగు సర్దేయాల్సింది. కానీ అదృష్టం బాగుండి తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకు నామినేషన్‌లోకి వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు. నామినేషన్‌లో ఉన్నవాళ్లలో అరియానా మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ మెహబూబ్ మీద అంతకన్నా ఎక్కువే ఉండటంతో అతడికి పెద్దగా ఓట్లు కురవలేదు. (చదవండి: మాస్టర్ అవుట్: మెహబూబ్‌కు కెప్టెన్సీ, కానీ!)
రోబో టాస్కు నుంచి మెహబూబ్‌పై వ్యతిరేకత
ఇక్కడ చిత్రమేమిటంటే హౌస్‌లో ఉన్న చాలామందితో పోలిస్తే మెహబూబ్ స్ట్రాంగ్ ప్లేయర్. ఫిజికల్ టాస్కులో ఇరగదీస్తాడు. మిగతావాళ్లకు గెలిచే అవకాశాన్నే ఇవ్వడు. అయితే అతడికి కండబలం ఉంది కానీ బుద్ధిబలం కాస్త తక్కువ. దాని ప్రతిఫలంగా కాయిన్ల టాస్కులో గెలిచే అవకాశాన్ని కాలితో తన్నేశాడు. టాస్కుల్లో తప్పితే సాధారణ సమయాల్లో అతడికి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ కూడా లభించలేదు. తన జిగిరీ దోస్త్ సోహైల్‌తో స్నేహం తప్ప ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఏం చేయాలన్నదానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇక రోబో టాస్కులో అతిగా ఆవేశపడి మొదట్లోనే వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. తర్వాత టాస్కులు ఆడుతూ తన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేసినా వీక్షకుల్లో మాత్రం మెహబూబ్‌పై ఆ వ్యతిరేకత అలాగే ఉండిపోయింది. ఫలితంగా ఈ వారం ఎలిమినేట్ అవక తప్పలేనట్లు తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని నాగార్జున రేపటి ఎపిసోడ్‌లో అధికారికంగా ప్రకటిస్తారా? లేదా ఏమైనా ట్విస్టులిస్తారా? అనేది చూడాలి. (చదవండి: లాఠీలతో కొట్టి స్టేషన్‌లో వేశారు: మెహబూబ్)
Comments
Please login to add a commentAdd a comment