
మొన్నటివరకు సంక్రాంతి సినిమాను తలపించిన బిగ్‌బాస్ హౌస్ నిన్ననటి నామినేషన్ ఎపిసోడ్‌తో రణరంగంగా మారిపోయింది. నామినేషన్ ప్రక్రియతో అందరి రంగులు బయటపడ్డాయని, ఎవరేంటో ఇప్పుడు తెలిసిందని గుసగుసలు పెడుతున్నారు. అప్పటివరకు స్నేహితులుగా ఉన్నవారు బద్ధ శత్రువులుగా మారిపోయారు. వారి మధ్య చెలరేగిన మంట చల్లారకముందే వారితో ఆటాడించేందుకు బిగ్‌బాస్ సిద్ధమయ్యాడు. ఫిజికల్ టాస్క్ ఆడించేందుకు ఇదే సరైన సమయమని భావించిన బిగ్‌బాస్ ఉక్కు హృదయం అని ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌ను రోబోలు, మనుషులుగా విభజిస్తూ వారి మధ్య కొట్లాట మొదలు పెట్టాడు. (బిగ్‌బాస్: ఏడుగురిలో ఇంటికెళ్లేది ఎవరు?)
ఈ టాస్క్‌లో నోయల్, అమ్మ రాజశేఖర్, అవినాష్, దేవి, మెహబూబ్, అఖిల్, సోహైల్ మనుషుల టీమ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గంగవ్వ రోబో వేషం ధరించి ఆటకు సై అంటోంది. ఇక రోబోలకు, మనుషులకు జరిగే యుద్ధాన్ని నేటి ఎపిసోడ్‌లో చూసి తీరాల్సిందే. అయితే మనుషుల టీమ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎక్కువగా ఉన్నారని, దీంతో వార్ వన్‌సైడ్ అయిపోయే అవకాశాలున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో ఈ టాస్క్‌లో ఎవరు బాగా ఆడితే వారికే ఈ వారం ఓట్లు గుద్దుతామంటున్నారు. ఇప్పుడు కదా అసలు ఆట మొదలైందంటూ నేటి ఎపిసోడ్ కోసం కొందరు తెగ ఎదురు చూస్తున్నారు. (బిగ్‌బాస్ టీమ్‌కు కావాల్సింది ఎడిట్ చేసి చూపించారు)
Comments
Please login to add a commentAdd a comment