
మ్యూజిక్ వీడియోలు, డ్యాన్స్ స్టెప్పులతో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు మెహబూబ్ దిల్‌సే. టిక్‌టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన ఇతడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌తోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎప్పుడైతే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాడో అప్పుడే అతడి దశ తిరిగిపోయింది. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.. ఈ రెండూ అతడి సొంతమయ్యాయి.
ఫలితంగా సొంతింటి కల సాకారం, తనకంటూ కొత్త కారు కొనుకున్నాడు. తాజాగా అతడి ఇంట పెళ్లి సంబరాలు జరిగాయి. మెహబూబ్ తమ్ముడు సుభాన్ షైఖ్ ఓ ఇంటివాడయ్యాడు. పెళ్లి డ్రెస్‌లో ఉన్న తమ్ముడితో పాటు, తండ్రితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు మెహబూబ్.
'నిఖా ముబారక్ మేరా భాయ్.. ప్రియమైన సోదరుడా.. నీ కలలు నిజం కావాలని, ఆ అల్లా మీ ఇద్దరినీ ఎల్లప్పుడూ కలిసి ఉంచాలని కోరుకుంటున్నాను. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఒకరికొకరు తోడుగా ఉండండి. ఎప్పుడూ సహనం, ఓర్పుతో మెదలండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు నిఖా చేసుకున్న సుభాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమ్మ కూడా ఉండుంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది మెహబూబ్ తల్లి మరణించింది.
Comments
Please login to add a commentAdd a comment