
బిగ్ బాస్ 4 హౌస్‌లో బీబీ హోటల్ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. హోటల్ సిబ్బందితో అతిథులు ఆడేసుకుంటున్నారు. ఇష్టం వచ్చిన వంటకాలను ఆర్డర్లు ఇవ్వడమే కాగా, పలాన టైంలోపే ఇవ్వాలని కండీషన్లు పెడుతున్నారు. దాంతో పాటు ఫిజికల్ టాస్కులు ఇచ్చి హోటల్ సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక రిచ్‌మెన్లుగా ఉన్న మోహబూబ్, సోహైల్‌లో అయితే తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. వారి చేష్టలు హోటల్ సిబ్బందికి కోపం తెప్పిస్తున్నటకీ ఓపికతో అడిగిన పనులన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మెహబూబ్ అయితే సిబ్బందితో ఓ ఆట ఆడుకుంటున్నాడు. మటన్ మండీ కావాలని, చికెన్ బిర్యానీ చెయ్యండంటూ సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నాడు. అయితే మెహబూబ్ మరింత రెచ్చిపోవడంతో హౌస్‌లో గొడవ జరిగింది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే ఆ విషయం తెలుస్తోంది.
(చదవండి : బిగ్ బాస్: అతిథుల టార్చర్.. కుప్పకూలిన అభి)
రిచ్‌మెన్లు అబద్దాలు ఆడుతున్నారని అవినాష్ అంటుండగా, నోరు జారకుండా మాట్లాడండి.. ఒక్క మాట తేడా వచ్చినా... పగిలిపోతుంది అంటూ మెహబూబ్ వార్నింగ్ ఇచ్చాయి. దీంతో ఆగ్రహానికి లోనైనా అఖిల్.. మెహబూబ్‌పై విరుచుకుపడ్డాడు. మాటలు కంట్రోల్ పెట్టుకోవాలని, ఒక లెవల్ దాటి మాట్లాడొదంటూ హెచ్చరించాడు. నేను నిన్ను అన్నానా అంటూ అఖిల్‌పై మెహబూబ్ ఫైర్ అయ్యారు. ఇక మధ్యలో కలగజేసుకున్న అవినాష్.. రౌడీయిజం చూపించుకోవాలంటే ఊర్లో చూపించుకో.. ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ చేసుకుంటే వేరేలా ఉంటుందంటూ మొహబూబ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అయితే మెహబూబ్ ఎవరిని ఉద్దేశించి సీరియస్ అయ్యారనేది తెలియాలంటే మరికొద్ది గంటల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.
#Mehboob warns the housemates #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/BuLYsviIoI
— starmaa (@StarMaa) October 7, 2020
Comments
Please login to add a commentAdd a comment