నిజంగానే దివి బ్యూటీ విత్‌ బలం కూడా | Mehaboob Shares His And Divi Vadthya Photos Inn Instagram | Sakshi
Sakshi News home page

నిజంగానే దివి బ్యూటీ విత్‌ బలం కూడా

Published Fri, Dec 18 2020 1:48 PM | Last Updated on Fri, Dec 18 2020 2:53 PM

Mehaboob Shares His And Divi Vadthya Photos Inn Instagram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సిజన్‌ 4 గ్రాండ్‌ ఫినాలేకు సిద్దమవుతోంది. ఈ సిజన్‌ ట్రోఫీ గెలుచుకునేది ఎవరా అని బిగ్‌బాస్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురూచుస్తున్నారు. ఈ క్రమంలో హౌజ్‌ నుంచి వెళ్లిపోయిన మెహబూబ్ దిల్‌సే‌, దివిలకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింటా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో దివి మహబూబ్‌ను ఎత్తుకుని ఫొటోలకు ఫొజిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మెహబుబ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా‌ గురువారం షేర్‌ చేశాడు. (చదవండి: సీరియ‌ల్స్‌లో అవ‌కాశాలు, కానీ.. : దివి)

వీటిని ‘బ్యూటీ విత్‌ బ్రెయిన్‌ యే కాదు.. బ్యూటీ విత్‌ బలం కూడా’ అంటూ మెహబూబ్‌ పోస్టు చేశాడు. అయితే హౌజ్‌లోని మగవారందరిలో మహబుబ్‌ కండలవీరుడన్న సంగతి తెలిసిందే. ఫిజికల్‌ లాస్క్‌లు వస్తే చాలు అందరూ మహబూబ్‌ను‌ చూసి దడుచుకునే వారు. అలాంటి మెహబూబ్‌ను దివి అలవోకగా ఎత్తుకోవడమే కాక ఎంచక్కా ఫొటోలకు ఫొజులు ఇవ్వడం చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో ‘నిజంగానే దివి బ్యూటీ విత్‌ బలం’ అంటూ ప్రశంసిస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్‌ గ్రాండ్ ఫినాలే: స‌్టార్ హీరో ఫిక్స్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement