Bigg Boss Gangavva boards her first flight, video goes viral - Sakshi
Sakshi News home page

Bigg Boss Gangavva: తొలిసారి విమానం ఎక్కిన గంగవ్వ.. ఫ్లైట్‌లో ఆమె హడావుడి చూశారా?

Published Sat, Mar 11 2023 12:12 PM | Last Updated on Sat, Mar 11 2023 1:30 PM

Bigg Boss Gangavva First Flight Experience Video Goes Viral - Sakshi

యూట్యూబ్‌ స్టార్‌, బిగ్‌బాస్‌ ఫేం గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరియం అక్కర్లేదు. మై విలేజ్‌ షో అనే యూట్యూబ్‌ చానల్‌ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ఆమె బిగ్‌బాస్‌ ద్వారా మరింత పాపులర్‌ అయ్యారు. బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొన్న ఆమె మోస్ట్‌ ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ద హౌస్‌గా కొనియాడారు. తనదైన మాటలు, తెలంగాణ యాసతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్‌ అనంతరం యూట్యూబ్‌ వీడియోలతో అలరిస్తున్న గంగవ్వ తొలిసారి విమానం ఎక్కింది. 

చదవండి: ఆస్కార్‌ స్టేజ్‌పై నాటు నాటుకు చరణ్‌, తారక్‌ డాన్స్‌? ఎన్టీఆర్‌ క్లారిటీ

బిగ్‌బాస్‌ హౌజ్‌లోని సౌకర్యాలు, లైట్లు, కెమెరాలు చూసి అవాక్కవైన గంగవ్వ ఫస్ట్‌టైం ఫ్లైట్‌ ఎక్కితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కనర్లేదు. విమానంలో ఆమె చేసిన హడావుడి అంతా ఇంత కాదు. శివరాత్రి సందర్భంగా మొదటిసారి విమానం ఎక్కిన గంగవ్వ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఫ్లైట్‌ డోరు, కిటికి తెరవమంటూ గంగవ్వ విమానంలోని సిబ్బందికి చుక్కలు చూపించింది. ఆమె చేసిన సందడి చూసి నెటిజన్లంత సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. దీంతో ఈ వీడియో గంటల్లోనే  వేలల్లో లైక్స్‌, లక్షల్లో వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో 6 మిలియన్ల వ్యూస్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. 

చదవండి: నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: వారికి తమ్మారెడ్డి కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement