
బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో మోస్ట్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ద హౌస్‌గా గంగవ్వను కొనియాడుతూ ఉంటారు. తను ఇంట్లో ఉన్నన్నిరోజులు హౌస్ కళకళలాడిపోయింది. తన మాటలతో, పంచులతో అందరినీ నవ్వించింది అవ్వ. కానీ పచ్చటి పల్లె వాతావరణమే ఊపిరిగా బతికే ఆమె ఏసీ గదుల్లో ఉండలేకపోయింది. అనారోగ్యంతో నీరసించిపోయింది. తనను పంపించేయమని వేడుకుంది. ఆమె గోస చూడలేక బిగ్‌బాస్ తనను హౌస్ నుంచి పంపించేశాడు. తిరిగి ఇంటికి వచ్చాక గంగవ్వ మళ్లీ యూట్యూబ్ వీడియోలతో రెచ్చిపోయింది. అందరికీ నవ్వుల పొట్లాలు పంచుతోంది. అయితే బిగ్‌బాస్ నుంచి వచ్చేటప్పుడు తనకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు నాగార్జున. ఆ హామీని నెరవేర్చాడు కూడా!
తాజాగా తన ఇంటికి సంబంధించిన విషయాలను పంచుకుంది గంగవ్వ. 'బిగ్‌బాస్ హౌస్‌లో 5 వారాలున్నందుకు రూ.10 లక్షలు ఇచ్చారు. నాగార్జున సార్ రూ.7 లక్షలు ఇచ్చారు. ఇల్లు కట్టడానికి మొత్తం రూ.20 లక్షలు ఖర్చైంది. అప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఇంకా కొన్ని వారాలుండాల్సింది, కానీ అప్పుడేం అర్థం కాలేదు. అదే ఇప్పుడైతేనా.. ఒక్కొక్కరిని బయటకు పారేశి తాళమేద్దును' అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment