
బిగ్‌బాస్ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గంగవ్వ హఠాత్తుగా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో ఆమె షో నుంచి వైదొలిగింది. నిజానికి ఈ సీజన్‌లో ఎక్కువ ఫాలోయింగ్ ఆమెకు మాత్రమే ఉంది. ఆమె షోలో అడుగు పెట్టిన మరుక్షణమే ఆర్మీలు పుట్టుకొచ్చాయి. నామినేషన్‌లోకి వచ్చినా కోట్లాది ఓట్లు ఆమెకు అత్యంత సులువుగా వచ్చి పడేవి. అలాంటి ఎంటర్‌టైనర్ అవ్వ. తన వాక్చాతుర్యంతో కుర్ర కంటెస్టెంట్లను కూడా హడలెత్తించేది. ఏదైనా తప్పు జరిగినట్లు అనిపిస్తే ఏమాత్రం సంకోచించకుండా ముఖం మీదే చెప్పేసేది. (చదవండి: బిడ్డ శవం ఎత్తుకుని వెళ్తే బస్సెక్కనియ్యలే)
కానీ ఎవరు కంటతడి పెట్టినా ఆమె మనసు తరుక్కుపోయేది. వెళ్లి తన చీరకొంగుతో కన్నీళ్లు తుడుస్తూ తల్లిలా ఊరుకోబెట్టేది. బిగ్‌బాస్ హౌస్‌లో అందరికీ ప్రేమలు పంచి, ప్రేక్షకుల గుండెల్లో గొప్ప స్థానాన్ని దక్కించుకున్న అవ్వ ఆరోగ్యం ఇప్పుడెలా ఉందన్న ప్రశ్న ఆమె అభిమానులను కలవరపరుస్తోంది. దీంతో మై విలేజ్ షో టీమ్ అవ్వ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చింది. గంగవ్వ ఆరోగ్యం చాలా సేఫ్‌గా ఉందని, ఎవరూ భయపడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. డాక్టర్ సలహా మేరకు ఒక వారం స్పెషల్ కేర్‌లో ఉంచామని పేర్కొంది. (చదవండి: బిగ్‌బాస్‌ను వీడిన గంగవ్వ, అఖిల్ కంటతడి)
Comments
Please login to add a commentAdd a comment