బిగ్‌బాస్‌: అరియానా నోరు మూయించిన గంగ‌వ్వ‌ | Bigg Boss 4 Telugu: Ariyana Glory Is The Main Reason For Fight | Sakshi
Sakshi News home page

ఇద్ద‌రిని ఏడిపించిన అరియానా

Published Wed, Sep 9 2020 10:58 PM | Last Updated on Wed, Sep 9 2020 11:21 PM

Bigg Boss 4 Telugu: Ariyana Glory Is The Main Reason For Fight - Sakshi

బిగ్‌బాస్ ఇంట్లోకి వ‌చ్చీరావ‌డంతోనే కలిసి ఉన్న కంటెస్టెంట్ల మ‌ధ్య చిచ్చు పెట్టింది అరియానా. ఆమె రాక‌తో ఇంట్లో గొడ‌వ‌లు, ఏడుపులు మ‌ళ్లీ షురూ అయ్యాయి. అస‌లు  నేటి ఎపిసోడ్‌లో ఏం జ‌రిగిందంటే.. రోజంతా తిండి పెట్ట‌లేద‌న్న కోపంతో అరియానా గ్లోరీ, స‌య్య‌ద్ సోహైల్ ఖాళీ క‌డుపుతోనే బిగ్‌బాస్‌ ఇంట్లోకి అడుగు పెట్టారు. వ‌చ్చీరాగానే పొద్దున్నుంచి ఏమీ తిన‌లేదు.. ఎందుకు ఫోన్ క‌ట్ చేశారు? అని అరియానా, సోహైల్.. నోయ‌ల్‌ను నిల‌దీశారు. ఫోన్ పెట్టేయ‌డం వ‌ల్లే ఇప్పుడు మీరు ఇద్ద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని నోయ‌ల్ బ‌దులిచ్చాడు. అయినా బిగ్‌బాస్‌లా ఎలా మాట్లాడ‌తార‌ని అభిజిత్ అడ‌గ‌డంతో అత‌నికి సోహైల్‌కు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. అర‌వ‌డం త‌న‌కూ వ‌చ్చంటూ సోహైల్ ఆవేశంతో ఊగిపోయాడు. దీంతో మిగ‌తా కంటెస్టెంట్లు క‌లుగ‌జేసుకుని కొత్త‌గా ఇంట్లోకి వ‌చ్చిన‌ ఇద్ద‌రినీ తిన‌డానికి పంపించారు. (చ‌ద‌వండి: శివ‌జ్యోతిని మించిపోయిన మోనాల్‌)

నిప్పు రాజేసిన అరియానా
త‌న‌కు తాను స్పెష‌ల్ అని భావించే అరియానా ఎవ‌రైనా తినిపిస్తేనే తింటాన‌ని చిన్న‌పిల్ల‌లా మారాం చేసింది. ప్లీజ్‌.. తినిపించండి అని అడ‌గ్గానే అఖిల్ ఆమెకు గోరుముద్ద‌లు తినిపించాడు. ఇది ఇత‌ర కంటెస్టెంట్ల‌కు మింగుడు ప‌డ‌లేదు. ఇది కూడా టాస్కేన‌ని, తినిపించ‌డం వ‌ద్ద‌ని వారించ‌డంతో తాను గోరుముద్ద‌లు పెట్ట‌లేన‌ని చెప్పేశాడు. దీంతో క‌ల్యాణి ఆమెకు ప్లేటు అందుకుని తినిపించింది. కానీ అఖిల్ అరియానాకు తినిపించిన విష‌యంలో ర‌భ‌స చోటు చేసుకుంది. త‌నకెవ‌రూ తినిపించ‌లేద‌ని, అందుకే ఆమె అడ‌గ్గానే తినిపించానంటూ బోరుమ‌ని ఏడ్చాడు. అరియానాకు తినిపించ‌డం వ‌ల్ల క‌ల్యాణి కూడా వెక్కి వెక్కి ఏడ్చింది. (చ‌ద‌వండి: క‌ట్ట‌ప్ప అత‌నే అంటున్న గంగ‌వ్వ‌)

గొడ‌వంతా జ‌స్ట్ టాస్క్‌:  సోహైల్‌
అఖిల్ ఏడుస్తుంటే చూసి కూడా అరియానా ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మనార్హం. ఇల్లు చూపించ‌మ‌ని అరియానా అడిగితే తాను చూపించ‌ను పొమ్మ‌ని హారిక తేల్చి చెప్పింది. ఇక‌ ఇంట్లోకి వ‌చ్చాక‌ అరియానా ప్ర‌వ‌ర్త‌న చూసి సోహైల్ కూడా ఖంగు తిన్నాడు. అస‌లు తినిపించ‌మ‌ని ఎందుకు అడుగుతున్నావ్‌? అని ఆరా తీయ‌గా ఇది నా గేమ్ అని స్ప‌ష్టం చేసింది. దీంతో ఈ గొడ‌వ అంత‌టికీ నిప్పు రాజేసింది అరియానా అని స్ప‌ష్టంగా తేలిపోయింది. ఇది మంచిప‌ద్ధ‌తి కాదు, ఇలా చేయ‌కూడ‌దు, బాగోదు అని సోహైల్ న‌చ్చ‌చెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ నా ఇష్టం, ఇదే క‌రెక్ట్, నాకు ఇలానే బాగుందంటూ మొండికేసింది. అయితే వ‌చ్చీరాగానే గొడ‌వ పెట్టుకోవ‌డం ఓ టాస్క్ అని సోహైల్ ఇత‌ర కంటెస్టెంట్ల‌కు చెప్పాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఫస్ట్‌ వీక్‌ నామినేషన్స్‌..)

అరియానాపై ప్ర‌తాపం చూపించిన గంగ‌వ్వ‌
ఇక త‌ర్వాతి రోజు కంటెస్టెంట్లు ఎప్ప‌టిలాగే డ్యాన్స్ చేశారు. గంగ‌వ్వ అయితే మ‌రీ హుషారుగా క‌నిపించింది. డంబెల్స్ ఎత్తుకుని ఎక్స‌ర్‌సైజ్ చేసింది. బిగ్‌బాస్ అని కేకేస్తూ కెమెరాకు ముద్దులు పెట్టింది. ఆ త‌ర్వాత‌ అవ్వ‌తో హారిక కాసేపు ముచ్చ‌ట్లు పెట్టింది. ఒక‌వేళ స‌డ‌న్‌గా ఎవ‌రైనా వ‌చ్చి న‌న్ను తీసుకుపోయార‌నుకో.. నీ చీర‌ల‌న్నీ ఇస్తే న‌న్ను పంపిస్తాం అంటే నువ్వు చీర‌లిస్తావా? అని హారిక అడిగితే ఎందుకు ఇస్తా, పోతే పో అని తేల్చి చెప్పింది. దీంతో లాస్య‌, హారిక ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఆ త‌ర్వాత హారిక‌ను కూల్ చేసేందుకు అవ్వ‌ ఫ్లైయింగ్ కిస్ కూడా ఇచ్చింది. ఇంత‌లో చీర‌కు మ్యాచింగ్ ఐత‌ది.. లిప్‌స్టిక్ పెట్టుకో అని అరియానా ఇచ్చిన స‌ల‌హాకు గంగ‌వ్వ కోపం న‌షాళానికెక్కింది. నాకేం వ‌ద్దు, ఎందుక‌రుస్తున్న‌వ్ ఇక్క‌డ‌ పో అని హెచ్చ‌రించింది. (చ‌ద‌వండి:బిగ్‌బాస్: 'అత‌ను‌ ఓవ‌రాక్ష‌న్ త‌గ్గించుకుంటే మంచిది' )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement