బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం అంతా సందడిగా సాగింది. అనుకున్నట్లే కింగ్ నాగార్జున్ తనదైన చలాకీతనం, అనుభవంంతో శనివారం ఎపిసోడ్‌ని ఎంటర్‌టైన్ చేశాడు. ఫన్నీ టాస్క్ ఇచ్చి ఎంటర్‌టైన్‌తో పాటు ఇంటి సభ్యుల క్యారెక్టర్ ఏంటో బయటపడేలా చేశాడు. అయితే ఈ టాస్క్‌కి బలి అయింది మాత్రం నేబర్ హౌజ్ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన సోహైల్, అరియానాలే. వీరిద్దరికి రకరకాల బొమ్మలు ఉన్న కొన్ని మెడల్స్ ఇచ్చి.. ఒక్కొ మెడల్ ఎవరెవరికి ఇస్తారో రీజన్ చెప్పి మెడలో వెయాలని చెప్పారు హోస్ట్ నాగార్జున. మొదటగా ఊసరవెళ్లి అని రాసి ఉన్న మెడల్‌ని సుజాతకు ఇచ్చారు. అప్పుడే ఏడుస్తుంది.అప్పుడే నవ్వుతుంది. వెంటనే బాధ పడుతుంది అందుకే ఆమెకు ఊసరవెళ్లి మెడల్ ఇచ్చామని సోహైల్, గ్లోరీ చెప్పుకొచ్చారు. ఇక కాకరకాయ(చేదు) మెడల్ దివికి, రోమాంటిక్ పర్సన్ అఖిల్‌కి ఇచ్చారు. అఖిల్ చాలా మంచోడని, కేరింగ్ కూడా ఎక్కువేనని, అతనంటే ఇష్టమని అరియానా చెప్పుకొచ్చింది. దీంతో నాగార్జున మరోసారి అరియానాకి అన్నం తినిపించాలని అఖిల్‌కు చెప్పుకొచ్చాడు.
(చదవండి :బిగ్‌బాస్: ఫస్ట్ కెప్టెన్‌గా కట్టప్ప! )
ఇక ఇంట్లో చిచ్చుపెట్టేది ఎవరనగా ఇద్దరూ కల్యాణిని సూచించారు. ఆమె ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ చెప్తారని అందుకే పుల్లలు పెట్టే మెడల్ ఆమెకు ఇస్తున్నామని సోహైల్ చెప్పాడు. డ్రామ క్వీన్ మెడల్ హారీక ఇవ్వగా.. కింగ్ నాగార్జున ఆశ్చర్యపోయారు. అసలు ఆ మెడల్ ఆమెకు సెట్ కాదని కింగ్ చెప్పేశాడు. ఇక సూర్య కిరణ్ ఇంట్లో ఏ పని చేయరంటూ బద్దకం మెడల్ ఇచ్చారు.
చెత్తకుండి మెడల్ ఎవరికి ఇస్తారని నాగ్ అడగ్గా.. అలాంటి వాళ్లు హౌస్‌లో ఎవరూ లేరని, ఆ మెడల్ ఇవ్వలేనని సోహైల్ చెప్పాడు. వెంటనే అరియానా కలుగజేసుకొని అభిజిత్‌కు ఆ మెడల్ ఇచ్చింది. తనకి ఎవరైనా అన్నం తినిపించమని అడిగినప్పుడు అభి.. నేను ఓవరియాక్షన్ చేస్తున్నానని అన్నాడని అందుకే అతనికి చెత్తకుండి మెడల్ ఇస్తానని ముఖం మీదే చెప్పేసింది. ఇక ‘తోపు’ మెడల్‌ని ముక్తకంఠంతో గంగవ్వకు ఇచ్చారు. బిగ్‌బాస్ హౌస్‌లో గంగవ్వను మించిన తోపు ఎవరూ లేరని, ఆమె ఎన్నో కష్టాలని చూసి వచ్చి ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున కూడా హౌస్‌లో గంగవ్వే తోపు అని స్పష్టం చేశాడు. ఇక బకరా మెడల్‌ని లాస్యకి, క్రయింగ్ బేబిని మోనాల్‌కు , ఫర్‌ఫెక్ట్ దేవికి, మిర్చి మెడల్‌ని గుంటూరు చిన్నోడు మెహబూబ్‌కి ఇచ్చారు. చివరగా జోకర్ మెడల్‌ని అమ్మ రాజశేఖర్ ఇస్తూ.. హౌస్‌లో అందరిని ఎంటర్‌టైన్ చేసే ఏకైక వ్యక్తి రాజశేఖర్ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment