బిగ్‌బాస్ నాల్గవ సీజన్ కంటెస్టెంట్ల ఎంపికపై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ కూడా కంటెస్టెంట్ల ఎంపికపై పెదవి విరిచాడు. ఈ సీజన్‌లో అంచనాలకు తగ్గట్టుగా పార్టిసిపెంట్ల ఎంపిక జరగలేదన్నాడు. అయితే కరోనా వైపరీత్యం కారణంగా కొద్ది నెలలుగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో చాలామంది మళ్లీ ఉపాధి వెతుక్కుని డబ్బు సంపాదించుకునేందుకు పరుగులు తీస్తున్నారు.. అందు వల్ల బిగ్‌బాస్ షోకు రావడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చన్నాడు. (చదవండి: ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే: తమన్)
లోపలికి వెళ్లిన కంటెస్టెంట్ల గురించి ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేనని, కాకపోతే గంగవ్వను ఎంపిక చేయడం మాత్రం విశేషమని కౌశల్ వ్యాఖ్యానించాడు. నిజానికి ఆమె వయసు వచ్చేసరికి అందరం పని నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాలని చూస్తాం, కానీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఓ సాధారణ పల్లెటూరు నుంచి ఓ బామ్మ బిగ్‌బాస్ షోలో పాల్గొనడం అసాధారణం అని చెప్పుకొచ్చాడు. ఆమె ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నాడు. పల్లెల్లో బిగ్‌బాస్ చూసేవారి సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతోనే ఆమెను తీసుకొచ్చారని అభిప్రాయపడ్డాడు. (చదవండి: ఇన్నాళ్లకు కౌశల్‌కు సినిమా అవకాశం)
"కేవలం ఫిజికల్ టాస్క్‌ల ద్వారానే కంటెస్టెంట్లు ఫైనల్‌కు చేరుకుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రెండో సీజన్‌లో గీతామాధురి ఫిజికల్ టాస్క్‌లో పెద్దగా కష్టపడకపోయినప్పటికీ ఫైనల్‌కు చేరుకుంది. ఈ లెక్కన గంగవ్వ 10 వారాల కన్నా ఎక్కువే హౌస్‌లో ఉండే అవకాశం ఉంది. ప్రతి చిన్నదానికి సూర్యకిరణ్ తనదే కరెక్ట్ అంటూ అతిగా ఆవేశపడుతున్నాడు. బహుశా.. ఇలా కోప్పడుతూ దుందుడుకుగా వ్యవహరిస్తే టీవీలో ఎక్కువసేపు కనిపిస్తామని కొందరు కంటెస్టెంట్లు అనుకుంటున్నారేమో. కానీ అన్ని వేళలా అదే జరగదు. అలాగే కావాలని ఎవరినైనా టార్గెట్ చేసినా అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక కంటెస్టెంట్లకు అప్పుడే ఫ్యాన్స్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. ఇవి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అయితే ఓ కంటెస్టెంట్ కోసం ర్యాలీ తీస్తూ పోరాడిన కౌశల్ ఆర్మీ మాత్రం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.." అని కౌశల్ చెప్పుకొచ్చాడు. (చదవండి: బిగ్‌బాస్: నోరు విప్పిన దివి వైద్య)
Comments
Please login to add a commentAdd a comment