
గంగవ్వ హౌస్‌లో అడుగుపెట్టి నాలుగువారాలవుతోంది కానీ కొందరి పేర్లు ఇప్పటికీ తనకు నోరు తిరగదు. యష్మిని కాస్త అశ్విని అనేసింది. దీంతో నామినేషన్స్‌లో అందరూ పడీపడీ నవ్వారు. గంగవ్వ యష్మిని నామినేట్ చేస్తూ.. గౌతమ్ బాగానే ఆడుతున్నాడుడు. కానీ నువ్వు.. ఆటలో గెలవకపోతే మాత్రం చించి సంచి కోసుకుంటవ్ అంటూ పక్కా తెలంగాణ యాసలో సెటైర్లు వేసింది.

నబీల్ రివేంజ్ నామినేషన్?
అది ఆమెకు ఏమర్థమైందో కానీ పకాపకా నవ్వింది. విష్ణుప్రియ.. ప్రేరణను అగ్రెసివ్ అంటూ నామినేట్ చేసింది. ఇక ఈ రోజు కోసం నబీల్ వారం రోజులనుంచి ఎదురుచూస్తున్నాడు. పోయినవారం మన క్లాన్‌లోని వారిని నామినేట్ చేసుకోవద్దని మరీ చెప్పాడు నబీల్. కట్ చేస్తే విష్ణుప్రియ నబీల్‌ను నామినేట్ చేసింది.

నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?
అది గుర్తుపెట్టుకుని మరీ విష్ణుప్రియపై ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక హరితేజ, ప్రేరణల మధ్య సైలెంట్‌వార్ కొనసాగుతూనే ఉంది. మొత్తానికి ఈ వారం హరితేజ, గౌతమ్, ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ నామినేషన్స్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment