కరోనా కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్ లేక బోసిపోతున్న జనాలకు వినోదాన్ని పంచేందుకు బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. షోలో పాల్గొనే కంటెస్టెంట్లను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, అందరికీ పరీక్షలు చేశాక నెగెటివ్ అని తేలితేనే లోనికి పంపించారు. షో కోసం పనిచేసే సిబ్బందిని కూడా సగానికి సగం తగ్గించారు. ఉన్న కొద్దిమంది కూడా కరోనా నిబంధనలు తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు. ఇంత పకడ్బందీగా చర్యలు చేపట్టినా ఆ మాయదారి కరోనా కన్ను బిగ్‌బాస్‌పై పడింది. తాజాగా షోలో పనిచేసే కొందరు టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. (బిగ్‌బాస్: మోనాల్‌కు అబిజిత్ కౌంటర్)
మరోవైపు ఇంట్లోనూ గంగవ్వ కాస్త అస్వస్థతకు గురైనట్లు కనిపిస్తోంది. అందుకే కొద్ది రోజులుగా వెళ్లిపోతా బిడ్డా అంటూ నోరు తెరిచి మరీ వేడుకుంటోంది. కానీ ఆమె విన్నపాన్ని నాగ్ మన్నించలేదు. అది ప్రేక్షకుల అభిప్రాయానికే వదిలేస్తున్నానంటూ చేతులు దులిపేసుకున్నారు. కానీ టెక్నీషియన్లకు కరోనా సోకిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా గంగవ్వకు కూడా కోవిడ్-19 పరీక్ష చేయించారట. ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో షో నిర్వహణకు మరిన్ని కఠినమైన చర్యలు తీసుకునేందుకు బిగ్‌బాస్ యాజమాన్యం సిద్ధమైంది. కాగా గంగవ్వ వరుసగా రెండోసారి కూడా ఎలిమినేషన్ రేసులో నిలబడింది. కానీ ప్రేక్షకులు గుద్దే ఓట్లతో ఇప్పట్లో ఆమె ఇంటికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అయితే హౌస్‌లో ఉండలేనని మాటిమాటికీ చెప్తుండటంతో బిగ్‌బాస్ నిర్వాహకులే ఓ అడుగు ముందుకేసి ఆమెను త్వరలోనే బయటకు పంపించేందుకు ఆలోచన చేస్తున్నారు. (బిగ్‌బాస్: ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీళ్లే)
Comments
Please login to add a commentAdd a comment