‘బిగ్‌బాస్’లో గంగవ్వ.. అఖిలూ, ఓ అఖిలూ అంటూ.. ‌ | Bigg Boss 4 Telugu: Reunion Celebration In Bigg Boss House | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : నిద్ర పట్టడం లేదు అఖిల్‌.. నాక్కుడా మోనాల్‌!

Published Fri, Dec 18 2020 11:43 PM | Last Updated on Sat, Dec 19 2020 1:45 PM

Bigg Boss 4 Telugu: Reunion Celebration In Bigg Boss House - Sakshi

మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ నాల్గో సీజన్‌ ముగిసిపోతుంది. అందుకే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఇది గుర్తుండి పోయేలా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. గత రెండు ఎపిసోడ్లలో కంటెస్టెంట్ల ప్ర‌యాణాన్ని వారి క‌ళ్ల‌ముందుంచిన బిగ్‌బాస్‌..నేడు ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి తీసుకొచ్చి పాత జ్ఞాపకాలను గుర్తుచేశాడు. అందరితోనూ సరదాగా డాన్సులు చేయించాడు. చిలిపి ప్రశ్నలు అడిగించి ఇంటి కంటెస్టెంట్స్‌తో ఆడుకునేలా చేసాడు. మోనాల్‌, కరాటే కల్యాణి, లాస్య, కుమార్‌ సాయి, స్వాతి దీక్షిత్‌ ఇలా  ఇలా చాలా మంది ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ మళ్లీ ఇంటికి వచ్చారు. ఇక హౌస్‌లో వారు చేసిన రచ్చ ఏంటో చదివేయండి

బయట కథ వేరే ఉంటది : మోనాల్‌
ప్రతి సీజన్‌ మాదిరే ఈ సారి కూడా హౌస్‌లోకి ఎలిమినేట్‌ అయిన సభ్యులను తీసుకువచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో నిబంధనల్ని పాటిస్తూ.. ఎంట్రీ ఇచ్చిన వారు కంటెస్టెంట్స్‌ని డైరెక్ట్‌గా కలవనీయకుండా వారిని ఒక అద్దాల గదిలో ఉంచారు. అద్దాల గదికి ఒక్క పక్క టాప్‌ 5 కంటెస్టెంట్స్‌.. మరో పక్క ఎలిమినేట్‌ అయిన సభ్యులు ఉన్నారు.  మొదటగా లాస్ట్‌ వీక్‌ ఎలిమినేట్‌ అయిన మోనాల్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఈ సందర్భంగా మ్యూజిక్ వినిపించగానే అఖిల్, సోహెల్ పరుగులు పెట్టి వచ్చారు. వారికి మోనాల్ కనిపించడంతో ఆనందంతో చిందులేశారు. అఖిల్‌ అయితే అడ్డుగా అద్దాలు ఉన్న సంగతి మర్చిపోయి మోనాల్‌కి హగ్‌లు, కిస్‌లు ఇచ్చాడు. ‘మూడు రోజుల నుంచి నిద్ర పట్టడం లేదు అఖిల్.. ప్రతి రోజు 3-4 అవుతుంది’అని అఖిల్‌తో తన బాధను చెప్పుకోగా..‘ నువ్వు వెళ్లాక నాక్కూడా నిద్ర పట్టలేదు.. అసలు పడుకోలేదు’ అని మోనాల్‌తో చెప్పాడు. అభిజిత్ కూడా మోనాల్‌ని చూసి సూపర్ ఉన్నావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు.

బయట ఎలా ఉందని సోహైల్‌ అడగ్గా.. ఏ విషయం చెప్పకుండా అంతా సూపర్‌ అని సరిపెట్టేసింది.  జనాలు నీ కోసం బయటకు ఎప్పుడు వస్తాడో అని వెయిట్ చేస్తున్నారు అంటూ సోహైల్‌కు మోనాల్ చెప్పడంతో ఆనందంతో గంతులు వేశాడు. ఆ తర్వాత అఖిల్‌ డ్రీమ్స్‌ అన్ని నెరవేరాలని కోరుతూ గాల్లోకి బెలూన్లను ఎగురవేసింది. బెలూన్లు గాల్లోకి ఎగరగానే అఖిలే నంబర్‌ వన్‌ అని మోనాల్‌ గట్టిగా అరిచింది. ఆ తర్వాత అభిజిత్‌ ప్యూచర్‌ బాగుండాలంటూ, అరియానాతో ఫ్రెండ్‌ షిప్‌ పెరగాలని, సోహైల్‌ బిగ్‌బాస్‌ విజేత కావాలంటూ బెలూన్లను పైకి ఎగురవేసింది. బయటకు వచ్చాక అందరం కలిసి పార్టీ చేసుకుందాం అని సోహైల్‌ అనగా.. బయట కథ వేరే ఉందని, కలిసేందుకు టైమ్‌ కూడా దొరక్కట్లేదని మోనాల్‌ చెప్పుకొచ్చింది. చివరగా అఖిల్‌కి హగ్‌ ఇచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. 

బిగ్‌బాస్‌లోకి ఇద్దరు వంటలక్కలు
ఆ తర్వాత హరికథ చెబుతూ.. కల్యాణి ఎంట్రీ ఇచ్చింది. ఇంటి సభ్యులందరిని చూసి కంటతడి పెట్టింది. మీ అందరిని ఎంత మిస్‌ అయ్యానో.. మీరంతా బయటకు వచ్చగా చక్కటి వంటలు చేసి పెడతా అంటూ ఎమోషనల్‌ అయింది. మీరు ఇంటి నుంచి వెళ్లాక.. స్వీట్‌ చేయడమే లేదని అభిజిత్‌ అనగా.. బయటకు రాగానే అన్ని వంటలు చేసి పెడతా అని కల్యాణి చెప్పింది. కల్యాణి ఇలా మాట్లాడుతుండగానే లాస్య ఎంట్రీ ఇచ్చింది. లాస్యను చూసి ఇంటి సభ్యులంతా ఆనందంతో గట్టిగా అరిచేశారు. జున్ను ఎలా ఉన్నాడు? బయట ఏంటి పరిస్థితి?లాంటి ప్రశ్నలు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. సోహైల్‌ అయితే ఇంట్లోకి ఇద్దరు వంటలక్కలు వచ్చారని పంచ్‌ వేశాడు. ఇక తనపై వంటలక్క 2.o అని మీమ్స్‌ వేస్తున్నారంటూ లాస్య తన బాధను పంచుకుంది. ఇక అభిజిత్‌ను చూస్తూ.. పాపం అభి.. తనతో టైమ్‌ స్పెండ్‌ చేయమని హారికను అడుక్కుంటున్నాడు అని అనగా.. లాస్యక్క నువ్వు కూడా తనకే సపోర్ట్‌ చేస్తున్నావా అని హారిక అలిగింది. అభి ఏమో.. ఎంత రిక్వెస్ట్‌ చేసినా తనతో స్పెండ్‌ చేస్తలేదని లాస్యకు కంప్లైంట్‌ ఇచ్చాడు. ఇలా లాస్య ఎక్కువ సమయం తన క్లోజ్‌ ఫ్రెండ్స్‌  హారిక, అభిజిత్‌లతోనే గడిపింది. 

అందరి కంటే అఖిల్‌కే ఎక్కువ హగ్స్!‌
ఇక లాస్య, కల్యాణి కలిసి ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్ ఆడించారు. తాము ఒక్కొక్కరిని కొన్ని ప్రశ్నలు అడుతామని.. వరుసగా ముగ్గురు అవును(ఎస్‌) అని చెబితే.. ఆ కంటెస్టెంట్‌ ఐస్‌ వాటర్‌ ఒంటిపై పోసుకోవాలని కండీషన్‌ పెట్టారు. మొదటగా అఖిల్‌పై ప్రశ్నలు అడుగుతూ.. అఖిల్‌కు ఎక్కువ హగ్స్  లభించాయని భావిస్తున్నారా?, అఖిల్‌ అరియానాను కంటే హారికను ఎక్కువగా ఫ్లర్టింగ్‌ చేస్త్నున్నాడా?, అఖిల్‌ అభిజిత్‌ కంటే మంచి సింగర్‌ అవునా కాదా? అని అడగ్గా.. ఇంటి సభ్యులంతా ముక్తకంఠంతో అవునని సమాధానం ఇచ్చారు. అఖిల్‌కు 2021లో పెళ్లి అవుతుందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మాత్రం అంతా నో అని చెప్పారు. 

అరియానాకి అవినాష్‌ కంటే చింటే ఎక్కువ ఇష్టం
ఇక అరియానాపై ప్రశ్నలు అడుగుతూ..  అరియానా ఇంట్లో తాను తెలివైనది అని భావిస్తోంది?, అరియానాకి అవినాష్‌ కంటే చింటు ఎక్కువ ఇష్టం?, అరియానా గొతు జలజ గొంతు కంటే భయంకరంగా ఉంటుంది? లాంటి ప్రశ్నలకు అంతా ఎస్‌ అని సమాధానం ఇచ్చారు. దీంతో అరియానా మూడుసార్లు ఐస్‌ నీళ్లు ఒంటిపై పోసుకుంది. 

ఇక సోహైల్‌ గురించి అడుతూ.. రాత్రి 9 గంటల తర్వాత సోహైల్‌ ఏ పని చేయడు. ఆయన మంచి బోల్డ్‌ డాన్సర్‌ అవుతాడు. సోహైల్‌ టూత్‌పేస్ట్‌ను ఫేస్‌ క్రీమ్‌గా వాడుతాడా లాంటి చిలిపి ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికి ఇంటి సభ్యులు అవుననే సమాధానం ఇచ్చారు.ఇక అభిజిత్‌ గురించి అడుతూ.. అభి వాళ్ల అమ్మ ఆయన కంటే ఫన్నీగా ఉంటారా? అభి ధరించే మోనాలి జాకెట్‌ ఆయన కంటే ఫేమస్‌ అని భావిస్తున్నారా? అని అడగ్గా.. అంతా ఎస్‌ అని సమాధానం ఇచ్చారు. ఈ గేమ్‌ అనంతరం లాస్య, కళ్యాణి ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

అఖిల్‌పై పగ తీర్చుకున్న కుమార్‌ సాయి
ఆ తర్వాత కుమార్‌ సాయి, స్వాతి దీక్షిత్‌ జంటగా ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులతో ఆడిపాడారు. ఇక కుమార్‌ సాయి అయితే తన పాత పగను అంతా తీర్చుకున్నాడు. అమ్మాయి అంటే హారికలా ఉండాలంటూనే ఆమెపై పంచ్‌లు వేశాడు. ‘అభిజిత్‌ను నామినేట్‌ చేస్తుంది మళ్లీ బాధపడుతోంది. నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద రీజన్ చెప్పావా?  టీ ఇవ్వలేదని లాంటి సిల్లీ రీజన్ చెప్పి నామినేట్‌ చేస్తుంది’అంటూ హారికను ఏడిపించాడు. ఆ తర్వాత అఖిల్‌ అంటే తనకు ఇష్టమని చెబుతూనే ‘నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది ఒకటి ఉంది.. అది ఏంటంటే పులిహోర. ఇద్దరికి కరివేపాకు అంటే నచ్చదు’ అని మరోసారి కరిపేపాకు గొడవను గుర్తు చేశాడు.  తర్వాత సొహైల్‌తో జరిగిన గొడవలో వేలు సెంటీ మీటర్ దిగింది.. సరిపోతుందా? అంటూ మళ్లీ పంచ్ వేశాడు. అనంతరం ఇంటి సభ్యులతో కలిసి డాన్స్‌ వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అఖిలు.. ఓ అఖిలు.. అంటూ గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. గంగవ్వ వాయిస్‌ విని ఇంటి సభ్యులంతా గార్డెన్‌ ఏరియాలోకి పరుగులు తీశారు. మరి బిగ్‌బాస్‌ హౌస్‌లో గంగవ్వ చేసిన సందడి ఏంటో రేపటి ఎపిసోడ్‌లో చదివేద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement