
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ఇప్పుడిప్పుడే ఇంట్రస్టింగుగా మారిందనుకుంటున్న సమయంలో బిగ్‌బాస్ ఆ పేరును చెగడొట్టేలా ఉన్నాడు. కెప్టెన్సీ టాస్క్ కోసం కొత్తగా ఆలోచించకుండా మూస పద్ధతిలో వెళ్లాడు. రెండు, మూడో సీజన్లలో ఇచ్చిన "రంగు పడుద్ది" టాస్క్‌నే కొంచెం కూడా మార్చకుండా మళ్లీ దింపేశాడు. ఇక ఈ పోటీలో గంగవ్వ, అభిజిత్, హారిక, అవినాస్ పాల్గొంటున్నారు. వాళ్లకు రంగు నీళ్లను నింపిన పాత్రలను ఇచ్చారు. అవి కిందపడగొట్టేందుకు మిగతా ఇంటి సభ్యులు నానా ప్రయత్నాలు చేస్తూ వారిని కంగారు పెట్టేస్తున్నారు. (చదవండి: చెరసాలలో చెత్తగా ఆడిన నోయల్!)
ఈ క్రమంలో అభి, అవినాష్ గిన్నెలలోని రంగు కిందపడిపోయింది. కానీ ఎవరెన్ని కోతి వేషాలు వేసినా అవ్వ మాత్రం గిన్నె తొణకకుండా పట్టుకోవడం విశేషం. దీంతో గంగవ్వే నెంబర్ 1, ఈసారి అవ్వే కెప్టెన్ అవుతుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. మరికొందరు మాత్రం కెప్టెన్సీ పోటీకి హారికకు బదులు అరియానాను పంపించాల్సిందని అభిప్రాయపడుతున్నరు. హారిక కూర్చున్న చోటే సవాలు చేసింది తప్పితే ఎక్కడా పెద్దగా ఆడలేదని, కానీ అరియానా ఎవరి మాటను ఖాతరు చేయకుండా ఓడినా సరే ప్రయత్నించాలటూ పట్టుదలను చూపించిందని పొగుడుతున్నారు. (చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో తలనొప్పిగా మారుతోన్న గంగవ్వ!)
మరో ప్రోమోలో అవ్వ ఇంటి సభ్యులు ఎలా ప్రవర్తించారో అనుకరించి చూపించడంతో పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఈ రోజు కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిందన్న ఆనందమో ఏమో కానీ కంటెస్టెంట్లు అందరూ తెగ హుషారుగా ఉన్నారు. ఈరోజు హౌస్‌లో అందరికీ దుర్గారావు పూనారు. ఆయనెవరు అనకండి. నాదీ నెక్కిలీసు గొలుసు పాట తెలుసు కదా! వీర లెవల్లో పర్‌ఫార్మెన్స్ ఇచ్చిన అతడిని ఇంటి సభ్యులు మించిపోయేలా డ్యాన్స్ చేశారు. ర్యాంప్ వాక్ చేస్తూ హొయలు పోయారు. మరో విషయమేంటంటే.. ఆల్ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ అబ్బాయిలందరూ ప్రతిజ్ఞ చేశారు. కానీ అందులో అఖిల్ మాత్రం కనిపించలేదు. నేటి ఎపిసోడ్‌లో నోయల్ జైలు శిక్ష పూర్తి చేసుకుని చెరసాల నుంచి బయట పడినట్లు కనిపిస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: రెండో వారం టీఆర్పీ పరిస్థితి ఇదీ!)
Comments
Please login to add a commentAdd a comment