Do You Know Bigg Boss 4 Fame Gangavva Income Through Youtube Channel - Sakshi
Sakshi News home page

Gangavva: యూట్యూబ్‌ ద్వారా గంగవ్వ నెల సంపాదన ఎంతంటే

Published Thu, Oct 6 2022 10:40 AM | Last Updated on Thu, Oct 6 2022 11:12 AM

Bigg Boss Fame Gangavva Income Through Youtube Channel - Sakshi

గంగవ్వ.. సోషల్‌ మీడియా యూజర్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ‘మై విలేజ్‌ షో’తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో అడుగు పెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. హౌజ్‌లో తనదైన తీరు, మాటలతో ఆకట్టుకున్న ఆమె అనారోగ్య కారణలతో ఐదో వారంలోనే బిగ్‌బాస్‌ హౌజ్‌ని వీడింది. ఇక బయటకు వచ్చాక గంగవ్వ పలు చిత్రాల్లో నటించే ఆఫర్‌ అందుకుంది. మల్లేషం, ఇస్మార్ట్‌ శంకర్, లవ్‌ స్టోరీ, రాజ రాజ చోర వంటి చిత్రాల్లో సైతం నటించింది. 

చదవండి: దీపావళికి ఓటీటీలో ‘బింబిసార’ మూవీ, రిలీజ్‌ డేట్‌ ఇదే!

వెండితెరపై అలరిస్తూనే మరోవైపు తన యూట్యూబ్‌ చానల్లో వీడియోలు చేస్తూ ఫాలోవర్స్‌ను ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తోంది గంగవ్వ. యూట్యూబ్‌తో ఎంతో పాపులారిటి సంపాదించుకున్న గంగవ్వ సంపాదన ఎంతనేది ఆసక్తిగా మారింది. దీంతో ఆరా తీయగా యూట్యూబ్‌ ద్వారా భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్ని ఖర్చులు పోను నెలకు లక్ష రూపాయల వరకు గంగవ్వకు ఆదాయం వస్తున్నట్టు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఒక రోజు సినిమా షూటింగ్‌కు గంగవ్వ రూ. 10వేల వరకు పారితోషికంగా తీసుకుంటారని వినికిడి. ఏదేమైన ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ ఇలా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడం విశేషం. 

చదవండి: వేలానికి శ్రీదేవి చీరలు, ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారంటేవ్వా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement