Gangavva Plays As Megastar Chiranjeevi Mother In Godfather Movie - Sakshi
Sakshi News home page

Chiranjeevi: ‘గాడ్‌ ఫాదర్‌’లో తన రోల్‌ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు..

Oct 4 2021 4:34 PM | Updated on Oct 4 2021 5:15 PM

Gangavva Plays As Chiranjeevi Mother In Godfather Movie - Sakshi

‘మై విలెజ్‌ షో’ అనే యూట్యూబ్‌ ఛానల్‌తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ ఆ తర్వాత బిగ్‌బాస్‌లో పాల్గొనే చాన్స్‌ కొట్టెసింది. బిగ్‌బాస్‌తో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా అయిపోయింది. ఇటీవల సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో కనిపించిన గంగవ్వ.. మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో కూడా నటించే అవకాశం కొట్టేసిన సంగతి తెలిసిందే. ‘లవ్‌స్టోరీ’ మాదిరిగా ఓ చిన్న పాత్ర చేస్తుందని అందరూ భావించారు. ఈ క్రమంలో ఆమె రోల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే

‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రంలో చిరంజీవికి గంగవ్వ తల్లిగా నటిస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా గంగవ్వ వెల్లడించింది. లవ్‌స్టోరీ మ్యాజికల్‌ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ మీట్‌లో భాగంగా మూవీ టీం ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. దీనికి డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల, హీరో నాగచైతన్యలతో పాటు గంగవ్వ కూడా పాల్గొంది. ఈ క్రమంలో తాను చిరంజీవి మూవీ షూటింగ్‌ కోసం ఊటీ వెళ్లానని, ఇందులో చిరుకు అమ్మగా నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. దీంతో అతి తక్కువ కాలంతో గంగవ్వ ఏకంగా మెగాస్టార్‌కు తల్లిగా నటించడం విశేషమని, గంగవ్వ చాలా లక్కీ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: Akkineni Nagarjuna: ‘నేను చూసిన నాగార్జుననే పేరు మార్చి శీనుగా చూపించా’

కాగా ఈ సినిమాలో చిరుకు సోదరిగా కీర్తి సురేశ్‌ నటిస్తన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం చిరు ఆచార్య, గాడఫాదర్‌ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మేవీ దాదాపు పూర్తయినప్పటికి పలు సన్నివేశాలు, పాటలు మిగిలి ఉండటంతో వాటి చిత్రకరణ జరుగుతోంది. దీనితో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో ఇటీవల లూసిఫర్‌ రీమేక్‌ ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టాడు చిరు. మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement