యూట్యూబ్ స్టార్ గంగవ్వకు పెద్ద సమస్యే వచ్చిపడింది. ఆమె బిగ్‌బాస్‌కు రాకముందు చాలా తక్కువ మంది ఆమెను కలిసేందుకు వచ్చేవాళ్లు. ఇప్పుడు మాత్రం నిత్యం వందల్లో అభిమానులు ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు. వారందరితో మాట్లాడి గొంతు పోతుందని గంగవ్వ వాపోయింది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజీ మీద ఆమె మాట్లాడుతూ మరో ఆసక్తికర విషయాన్ని సైతం బయటపెట్టింది. తనకు ఇల్లు కావాలన్న కల నెరవేరుతోందని చెప్పుకొచ్చింది. ఇప్పటికే తన ఊరిలో ఇంటి నిర్మాణం కోసం ముగ్గు కూడా పోసినట్లు వెల్లడించింది. దీంతో త్వరలోనే ఆమె కళ్లముందు కలలు గన్న ఇల్లు రూపుదిద్దుకోనుందన్నమాట. (చదవండి: బిగ్‌బాస్: అదరగొట్టిన ఆ నలుగురు.. కరీంనగర్ బిడ్డలే)
కాగా బిగ్‌బాస్ షోలో అడుగు పెట్టిన గంగవ్వ అందరితో కలిసిపోవడమే కాక వాళ్ల మీద పంచ్‌లు కూడా విసిరేది. ఎలాగైనా చివరి వరకు ఉండాలని బలంగా నిర్ణయించుకుని హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను నామినేట్ చేయాలంటే కూడా ఇతరులకు వెన్నులో నుంచి వణుకు పుట్టేది. ఆమె మాటకు ఎవరూ అడ్డు చెప్పేవాళ్లే కాదు. అరవై ఏళ్ల వయసులో కూడా ఎనర్జీగా స్టెప్పులేసిన ఆవిడ చివరికి అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమె తనను పంపించేయడంటూ పెద్దన్న బిగ్‌బాస్‌ను, చిన్నన్న నాగార్జునను అభ్యర్థించింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న బిగ్‌బాస్ ఆమెను హౌస్ నుంచి పంపించేశారు. ఈ క్రమంలో తనకు ఇల్లు కట్టివ్వండి అని అవ్వ నోరు తెరిచి అడగడంతో నాగార్జున ఆమె కలను సాకారం చేసే బాధ్యతను భుజాన వేసుకున్నారు. అందులో భాగంగానే ఆమె ఊర్లో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో గంగవ్వ లక్ష రూపాయల చెక్కును అందుకోగా ఈ మధ్యే దానితో బంగారం కూడా కొనుగోలు చేసింది. ఇప్పుడిక సొంతింటి కల కూడా నెరవేరుతుండటంతో గంగవ్వ సంతోషం వ్యక్తం చేసింది. (చదవండి: పెద్దగా ఆకట్టుకోని కంటెస్టెంట్లు వీళ్లే..)
Comments
Please login to add a commentAdd a comment