
సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది. ఫిదా మీ ఫేవరెట్ స్టార్‌తో, పండగ చేస్కో, సూపర్ సింగర్, లక్కీ ఛాన్స్.. ఇలా పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది.
అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది. యాక్టింగ్, యాంకరింగ్ రెండింట్లోనూ ఆరితేరిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. మూడేళ్ల కూతురిని వదిలేసి మరీ రియాలిటీ షోలో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈసారి జనాల్ని అంతగా మెప్పించలేకపోయింది. ఫలితంగా పదోవారమే హౌస్‌లో నుంచి వెళ్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment