
నామినేషన్స్ అంటే మాటల యుద్ధమే.. ఎప్పుడూ ఇద్దర్ని నామినేట్ చేయాలని చెప్పే బిగ్‌బాస్ ఈసారి మాత్రం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలన్నాడు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..

హరితే, ప్రేరణ.. ఇద్దరూ ఇద్దరే!
మొదటగా పృథ్వీ.. నాకు నెక్ ఫాంటసీ ఉందనడం నచ్చలేదంటూ రోహిణిని నామినేట్ చేశాడు. నెక్ ఫాంటసీ అన్నది బూతు పదమా? అని రోహిణి ఆశ్చర్యపోయింది. హరితేజ.. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది.. నోటికొచ్చిన మాటలు అనేయొద్దని ప్రేరణను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ వాదులాడుకున్నారు. హరితేజ చెప్పే పాయింట్లు కరెక్టే ఉన్నా కాస్త యాక్టింగ్ చేస్తూ చెప్పడం అతిగా అనిపించింది.

తెలుగులో కొత్త బూతు 'అక్క'
అటు ప్రేరణ కూడా ఈమెపై రివేంజ్ నామినేషన్ చేసింది. అంత అరుచుకున్నాక చివర్లో ఇద్దరూ కలిసిపోయి హగ్గులిచ్చుకోవడం గమనార్హం. నిఖిల్ వంతురాగా.. ఒకమ్మాయి తనను అక్కా అని అనొద్దని చెప్తున్నా పదేపదే అనడం బుల్లీయింగ్ అంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. అక్కా అనడంలో తప్పేముంది? అని గౌతమ్ అంటే అశ్వత్థామ అని పిలిస్తే నువ్వు హర్టయినప్పుడు.. ఆమె వద్దంటున్నా అక్కా అని పిలవడం కూడా తప్పేనని లాజిక్ లేని సమాధానమిచ్చాడు.

అశ్వత్థామ ఈజ్ బ్యాక్.
దీంతో చిర్రెత్తిన గౌతమ్.. ఇప్పుడు చెప్తున్నా.. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.. నన్ను ట్రోల్ చేసుకోండి.. ఏమైనా చేసుకోర్రి అన్నాడు. ఇద్దరూ అరుచుకుని కాసేపటికి నిఖిల్.. అమ్మతోడు, గేటు తీయమను.. బయటకెళ్లి చూసుకుందాం అని రెచ్చగొట్టాడు. నా ప్రవర్తన తప్పు అంటున్నావ్.. మరి నా మీద కోపాన్ని టాస్కులో అమ్మాయిలపై చూపించడం తప్పు కాదా? ఎవరేంటో నాకర్థమైంది.. ఇప్పుడు నాకు భయం లేదు, ఎవరికీ వినేది లేదు, తగ్గేది లేదు అని గౌతమ్ ఆవేశంతో మాట్లాడుతుంటే రోహిణి, హరితేజ చప్పట్లు కొట్టారు.

నువ్వే ఆ ఛాన్సిచ్చావు
విష్ణుప్రియ వంతు రాగా.. నేను నిన్ను నామినేట్ చేయకూడదనుకున్నాను.. కానీ నువ్వే ఆ ఛాన్సిచ్చావు! ఈ వారం చాలా తప్పులు చేశావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. నబీల్.. పోయినవారం నామినేషన్స్‌లో ఫేవరెటిజం చూపించావు, మెగా చీఫ్‌గా ఫెయిలయ్యావంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.

చప్పట్లు కొట్టిన గంగవ్వ
గంగవ్వ.. యష్మిని అశ్విని అనడంతో అందరూ పడీపడీ నవ్వాడు. గౌతమ్ బాగా ఆడతాడు. చిన్నదానికీ పెద్దదానికీ నువ్వు, ప్రేరణ ఇద్దరూ అతడిపై అరుస్తారు. ఆటలో గెలవకపోతే మాత్రం చీదరించుకుంటావు అని చెప్పింది. నామినేట్ అయినందుకుగానూ యష్మిపై ఆయిల్ పెయింట్ పడటంతో గంగవ్వ చప్పట్లు కొట్టింది. రోహిణి.. మెగా చీఫ్ కంటెండర్‌షిప్ గేమ్‌లో నీకంటే ఒక అడుగు ముందున్న గౌతమ్‌ను సైడ్ చేయడం బాగోలేదని యష్మిని నామినేట్ చేసింది.

బిగ్‌బాస్‌కు గౌరవం ఇవ్వలేదు
గౌతమ్ వంతు రాగా.. టీమ్‌లీడర్‌గా ఉన్నప్పుడు పదేపదే ఇరిటేట్ అయ్యావ్.. రెండోది నన్ను గేమ్‌లో సైడ్ చేసినప్పుడు నాకో కారణం చెప్పావ్.. కానీ వెనకాల మరో కారణం చెప్పావ్.. అంటూ యష్మిని నామినేట్ చేశాడు. తేజ.. నామినేషన్స్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో నువ్వు స్మోకింగ్ జోన్‌లో సిగరెట్ తాగుతూ కూర్చున్నావు.. ఇది బిగ్‌బాస్‌ను అగౌరవపర్చాడంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.

ఆమెను సేవ్ చేసిన అవినాష్
యష్మి.. నువ్వు నన్ను అక్కా అని పిలవడం నచ్చలేదు. క్రష్ అంటావ్, అక్కా అంటావ్.. ఫ్లిప్ అవుతున్నావు అంటూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. చివర్లో ఒకరిని స్వాప్ చేసే అధికారం మెగా చీఫ్ అవినాష్‌కు ఇవ్వడంతో అతడు రోహిణిని సేవ్ చేసి ఆమె స్థానంలో నిఖిల్‌ను నామినేట్ చేశాడు. అలా ఈ వారం యష్మి, ప్రేరణ, గౌతమ్, నిఖిల్, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ నామినేట్ అయ్యారు.



Comments
Please login to add a commentAdd a comment