Hariteja Strong Counter To Netizen Who Wished Her Test Coronavirus Positive - Sakshi
Sakshi News home page

Hari Teja: 'నీ ఎదవ ఓవరాక్టింగ్‌, నీకు కరోనా రావాలి' అంటూ నెటిజన్‌ కామెంట్స్‌

Published Sat, Jan 22 2022 11:07 AM | Last Updated on Sat, Jan 22 2022 12:32 PM

Hariteja Strong Counter To Netizen Who Wished Her Test Coronavirus Positive - Sakshi

ప్రముఖ నటి, యాంకర్‌ హరితేజ ఆన్‌ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌ స్క్రీన్‌లోనూ మహా చలాకీగా ఉంటుంది. సినిమాల్లో తన యాక్టింగ్‌తో అలరించే ఆమె బుల్లితెర షోలలో తనదైన పంచ్‌ డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తుంది. తాజాగా ఆమె అభిమానులతో చిట్‌చాట్‌ నిర్వహించింది. 'ఇంకేంటి మరి డోలో? సారీ బోలో' అంటూ తనకు ప్రశ్నలు విసరమని చెప్పింది. దీంతో ఓ నెటిజన్‌ ఆమె మీదున్న అక్కసును వెల్లగక్కుతూ 'నీకు కరోనా పాజిటివ్‌ రావాలి' అని కోరుతూ కామెంట్‌ చేశాడు.

దీనికి హరితేజ స్పందిస్తూ.. 'మీకు కొంచెం పాజిటివ్‌ యాటిట్యూడ్‌ రావాలి.. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక' అని రిప్లై ఇచ్చింది. ఇక మరో నెటిజన్‌.. 'నువ్వూ నీ ఎదవ ఓవర్‌ యాక్టింగ్‌.. ఇంత సీరియస్‌ సిచ్యుయేషన్‌లో కూడా నీ పిచ్చి సిల్లీ జోక్స్‌.. థూ' అని ఘాటుగా కామెంట్‌ చేశాడు. దీనికి హరితేజ తనదైన స్టైల్‌లో కౌంటరిచ్చింది. 'అబ్బో.. మస్త్‌ బీపీ వొస్తాందా సార్‌ మీకు.. సల్ల పడండి జర.. నవ్వుకుంటే అన్ని బాధలు పోతయ్‌ అని నేను నమ్ముతాను.. మరీ అంత పొగరు పనికి రాదు' అంటూ అతడి నోరు మూయించింది.

ఇక మరొకరైతే 'మీకు కరోనా పాజిటివ్‌ అనిపిస్తుందండీ' అని చెప్పడంతో 'ఆహా.. సానా హాపీగా ఉంది కదండీ మీకు. ఇంకేం అనిపిస్తుంది సార్‌ మీకూ..' అని అంతే వెటకారంగా సమాధానమిచ్చింది. కాగా హరితేజ గతేడాది ఏప్రిల్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే! డెలివరీ సమయంలో ఆమెకు కరోనా ఉండటంతో పాపను ఆమెకు దూరంగా ఉంచారు. దీంతో కొన్నాళ్లపాటు తన కూతురిని వీడియో కాల్‌లో చూసుకుని మురిసిపోయింది హరితేజ. కోవిడ్‌ను జయించాక బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని మురిసిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement