Actress Hariteja Shares Latest Pics On Instagram Goes Viral - Sakshi
Sakshi News home page

Actress Hariteja: నటి హరితేజ షాకింగ్‌ లుక్‌ వైరల్‌.. ఇలా మారిపోయిందేంటి?

Mar 28 2023 10:13 AM | Updated on Mar 28 2023 11:06 AM

Actress Hariteja Shares Yellow Lehenga Pics On Instagram Photos Goes Viral - Sakshi

ప్రముఖ నటి, యాంకర్‌ హరితేజ ఆన్‌ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌ స్క్రీన్‌లోనూ మహా చలాకీగా ఉంటుంది. సినిమాల్లో తన యాక్టింగ్‌తో అలరించే ఆమె బుల్లితెర షోలలో తనదైన పంచ్‌ డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తుంది. అంతేకాదు సటైరికల్‌ కామెంట్స్‌తో ఇంచుమించు మరో సూర్యకాంతంలా పేరు సంపాదించుకుందంటూ ఓ ఈవెంట్‌లో ఏకంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అన్న విషయం తెలిసిందే. అలా వచ్చిన క్రేజ్‌తో బిగ్బాస్ ఆఫర్‌ కొట్టేసింది. మొదటి సీజన్‌లో పార్టిసిపెంట్‌గా వెళ్లి మంచి పేరు సంపాదించుకున్న ఆమె అనంతరం అదే క్రేజ్‌ను కొనసాగించలేకపోయింది.

ఇక 2021లో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన హరితేజ తరచూ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ని పలకరిస్తుంది. తన ఫొటోలు, కూతురు ఫొటోలు షేర్‌ చేస్తూ నెట్టంట సందడి చేస్తుంది. ఈక్రమంలో ఆమె షాకింగ్‌ లుక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా ఆరింది. ఆఫర్స్‌ లేక ఇంటికే పరిమితమైన హరితేజ బరువెక్కిన సంగతి తెలిసిందే. అయితే సడెన్‌గా ఆమె బక్కచిక్కి కనిపిచింది. తాజాగా తన లంగావోణి ఫొటోలు షేర్‌ చేయగా.. అందులో చాలా సన్నగా కనిపించి షాకిచ్చింది. ఇక హరితేజను ఇలా చూసి ఆమె ఫాలోవర్స్‌ అంతా అవాక్కవుతున్నారు. సడెన్‌గా ఇంత చేంజ్‌ ఏంటీ? అంటూ ఆమె పోస్ట్‌పై స్పందిస్తున్నారు. 

అంతేకాదు ఆమె డైట్‌ ప్లాన్‌ ఏంటని కూడా ఆరా తీస్తున్నారు. ఇలా అస్సలు బాలేవు.. కాస్తా బొద్దుగా ఉంటేనే బాగున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా కూచిపూడి డ్యాన్సర్ అయిన హరితేజ యాంకరింగ్ చేస్తూ, సీరియల్స్‌లో నటించే చాన్స్‌ కొట్టేసింది. మనసు-మమతతో మంచి గుర్తింపు పొందిన ఆమె ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అందరి బంధువయ, దమ్ము, దువ్వాడ జగన్నాధం, అనగనగా ఓ ధీరుడు , విన్నర్ , అత్తారింటికి దారేది , ఉంగరాల రాంబాబు ,  రాజా ది గ్రేట్ వంటి హిట్‌ చిత్రాల్లో సహానటి పాత్రలు పోషించింది. 

చదవండి: 
వేడుకగా చరణ్‌ బర్త్‌డే పార్టీ.. టాలీవుడ్‌ తారల సందడి
డైరెక్టర్‌తో ఏడేళ్లు ప్రేమ, పెళ్లి.. పెళ్లైన వారానికే నరకం చూశా: నటి జయలలిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement