Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో మాజీ కంటెస్టెంట్లు సందడి చేయబోతున్నారు. ప్రతి సీజన్‌లాగే ఈ సారి కూడా సీనియర్లు హౌస్‌లోని ఫైనలిస్టులతో ముచ్చటించనున్నారు. అందులో భాగంగా గీతా మాధురి, అఖిల్ సార్థక్, రోల్ రైడా, హరితేజలు హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
కాకపోతే కరోనాను దృష్టిలో పెట్టుకుని రూమ్‌లో నుంచే మాట్లాడనున్నారట. మరి వీళ్ల రాకతో బిగ్‌బాస్ ఎపిసోడ్ వెలిగిపోవడం ఖాయం! వీరు ఎవరెవరికి బూస్ట్ ఇస్తారో, ఎవర్ని ఆడేసుకుంటారో చూడాలి! ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్ విన్నర్ ఎవరనేది తేలనుంది. సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. వీరిలో ఎవరు ట్రోఫీ ఎగరేసుకుపోతారనేది ఆసక్తికరంగా మారింది!
Comments
Please login to add a commentAdd a comment