Roll Rida
-
7 హార్ట్ టచింగ్ ర్యాప్ సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాం
-
బిగ్‌బాస్ హౌస్‌లో బీబీ జోడీలు.. ఎంటర్టైన్మెంట్ అదిరిపోలా!
రేపటితో బిగ్‌బాస్ షో కథ క్లోజ్ కానుంది. శ్రీసత్య ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఐదుగురు మిగిలారు. వీరంతా ఫైనల్‌కు చేరుకున్నామన్న సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇకపోతే గత బిగ్‌బాస్ సీజన్లలో అలరించిన కొందరు కంటెస్టెంట్లతో త్వరలో బీబీ జోడీ రానుంది. ఈ షోలో ముక్కు అవినాష్- అరియానా, అఖిల్-తేజస్వి, అర్జున్- వాసంతి, సూర్య- ఫైమా, రవికృష్ణ- భాను, మెహబూబ్- అషు, చైతు- కాజల్, రోల్ రైడా-స్రవంతి జంటలుగా పాల్గొననున్నారు. ఈ షోను ప్రమోట్ చేసే క్రమంలో నేడు అషు, మెహబూబ్, అవినాష్, అరియానా హౌస్‌లో అడుగుపెట్టారు. ఇక ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్ అయిన అవినాష్ ఇంట్లో బెల్లీ డ్యాన్స్, నాగిని డ్యాన్స్ చేసి అందరినీ నవ్వించారు. మరి మాజీ కంటెస్టెంట్ల రచ్చ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! చదవండి: డబ్బు కోసమే వచ్చానన్న శ్రీసత్య ఎంత సంపాదించిందంటే? తుస్సుమన్న అవతార్ 2, ఆసినిమాను కూడా దాటలేకపోయింది -
టాప్ 9 కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ మరో సర్ప్రైజ్
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈపాటికే ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించిన బిగ్‌బాస్ వీకెండ్లో మిగతా ఇంటిసభ్యులను, ఫ్రెండ్స్‌ను స్టేజీపైకి రప్పించి వారిని సర్ప్రైజ్ చేయనున్నాడు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. టాప్ 9 కంటెస్టెంట్ల కోసం వీజే సన్ని, రోల్ రైడా, బుల్లెట్ భాస్కర్, సింగర్ సాకెత్, సోహైల్ ఇలా ఎంతోమంది వచ్చారు. అయితే ఈసారి వారితో ఎవరు టాప్5 అనే గేమ్‌కు బదులుగా మరో డిఫరెంట్ గేమ్ ఆడించాడట. అదేంటో తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: అలాంటి కథలు చిరంజీవికి సెట్ కావు: పరుచూరి ఫైమా చేతిలో ఎలిమినేషన్, అతడే ఎలిమినేట్ కానున్నాడా? -
ఆడేసుకున్న మాజీ కంటెస్టెంట్లు, అంతా బిగ్‌బాస్ వరకే అన్న షణ్ను!
Bigg Boss Telugu 5, Episode 105: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఫైనలిస్టులతో మాజీ సీజన్ల కంటెస్టెంట్లు రచ్చరచ్చ చేశారు. మొదటగా ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్లు శివబాలాజీ, హరితేజ హౌస్‌మేట్స్‌తో ముచ్చటించారు. శ్రీరామ్‌తో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా వారు వెళ్లిపోతారని సెటైర్ వేయడంతో అతడు తల పట్టుకున్నాడు. తర్వాత ఒక పీపా పట్టుకుని ఊదితే ఆ పాటేంటో హౌస్మేట్స్ గెస్ చేయాలి. పాట సరిగ్గా గెస్ చేస్తే దానికి డ్యాన్స్ చేయాలి. ఈ క్రమంలో షణ్ను, సిరి కలిసి జంటగా స్టెప్పులేస్తుంటే మిగతా ముగ్గురు మాత్రం ఎవరికి వారే డ్యాన్స్ చేశారు. ఇది చూసిన హరితేజ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన ముగ్గురిపై జాలి చూపించింది. దీంతో రెచ్చిపోయిన శ్రీరామ్ సిరిని ఎలిమినేట్ చేసినట్లే చేసి మళ్లీ తీసుకొచ్చారంటూ జోక్ చేశాడు. ఇక హరితేజ బిగ్‌బాస్ షో గురించి, టాప్ 5 కంటెస్టెంట్ల గురించి హరికథ చెప్పి వీడ్కోలు తీసుకున్నారు. తర్వాత రెండో సీజన్ కంటెస్టెంట్లు గీతా మాధురి, రోల్ రైడా ఆటపాటలతో హౌస్‌మేట్స్‌ను అలరించారు. టాప్ 5లో చోటు దక్కించుకున్న సిరి తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఆదర్శం అంటూ తెగ పొగిడాడు. అయితే వచ్చిన కంటెస్టెంట్లు అందరూ పొగడ్తలతో పాటు షణ్ను, సిరిల ఫ్రెండ్షిప్పై సెటైర్లు వేస్తూ వారిని ఓ ఆటాడుకుండటంతో సన్నీ, మానస్, శ్రీరామ్ పడీపడీ నవ్వారు. అసలే చిన్న మాట అంటేనే తట్టుకోలేని షణ్ను ఇలా అందరూ కలిసి తన మీద పడిపోవడంతో అట్టుడికిపోయాడు. మనిద్దరం హైలైట్ అయిపోతున్నామని ముగ్గురికీ మండిపోతున్నట్లుందని సిరితో వాపోయాడు. అయితే సిరి మాత్రం ఏ షిప్ అయినా బిగ్‌బాస్ హౌస్ వరకే అని షణ్ను అన్న మాటను గుర్తు చేసుకుని బాధపడింది. దీంతో అతడు సిరిని ఓదార్చుతూ హగ్ చేసుకున్నాడు. ఇది చూసిన సన్నీ.. బయటకు వెళ్లాక షణ్ను హగ్ గురూ అయిపోతాడని కామెంట్ చేశాడు. అనంతరం నాలుగో సీజన్ కంటెస్టెంట్లు శివజ్యోతి, సావిత్రి హౌస్‌మేట్స్‌తో కబుర్లాడారు. బెలూన్లలోని హీలియం పీల్చుకుని పాట లేదా డైలాగులు చెప్పాలన్నారు. ఈ గేమ్‌లో హౌస్మేట్స్ గొంతులు మారిపోవడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఐదో సీజన్ కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్, అరియానా వచ్చీరాగానే శ్రీరామ్ చేసిన మొట్ట మొదటి ఆల్బమ్‌లోని సాంగ్ ప్లే చేయడంతో అతడు సర్ప్రైజ్ అయ్యాడు. ఆ వెంటనే కంటెస్టెంట్లందరినీ కొన్ని సరదా ప్రశ్నలడిగారు. అందులో భాగంగా డేటింగ్ యాప్‌లో ఎవరినైనా కలిశారా? అని అడగ్గా సన్నీ ఒకరిని కలిశాను కానీ ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పుకుంటూ పోయిందని, దీంతో తానే ఆమెను ఓదార్చాల్సి వచ్చిందన్నాడు. వేరే కంటెస్టెంట్ టవల్ వాడారా? అన్న ప్రశ్నకు షణ్ను.. శ్రీరామ్ టవల్ వాడానని చెప్పగా మధ్యలో సిరి కలగజేసుకుంటూ తన టవల్ కూడా వాడాడని ఆరోపించింది. కొన్ని ఫొటోలు చూపించి అవి హౌస్‌లో ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్న గేమ్‌లో శ్రీరామ్ గెలిచాడు. సిరి తాను తీసుకోవాలనుకుని మర్చిపోయిన ఫొటోను అఖిల్, అరియానా చూపించడంతో ఆమె చాలా సర్ప్రైజ్ అయింది. అంతేకాదు షణ్ను, సిరి ఆ ఫొటోలో ఏ పాటకైతే డ్యాన్స్ చేశారో మరోసారి అదే సాంగ్‌కు స్టెప్పులేశారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ సరదా సరదాగా సాగింది. -
బిగ్‌బాస్ హౌస్‌లోకి నలుగురు మాజీ కంటెస్టెంట్లు
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో మాజీ కంటెస్టెంట్లు సందడి చేయబోతున్నారు. ప్రతి సీజన్‌లాగే ఈ సారి కూడా సీనియర్లు హౌస్‌లోని ఫైనలిస్టులతో ముచ్చటించనున్నారు. అందులో భాగంగా గీతా మాధురి, అఖిల్ సార్థక్, రోల్ రైడా, హరితేజలు హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాకపోతే కరోనాను దృష్టిలో పెట్టుకుని రూమ్‌లో నుంచే మాట్లాడనున్నారట. మరి వీళ్ల రాకతో బిగ్‌బాస్ ఎపిసోడ్ వెలిగిపోవడం ఖాయం! వీరు ఎవరెవరికి బూస్ట్ ఇస్తారో, ఎవర్ని ఆడేసుకుంటారో చూడాలి! ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్ విన్నర్ ఎవరనేది తేలనుంది. సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. వీరిలో ఎవరు ట్రోఫీ ఎగరేసుకుపోతారనేది ఆసక్తికరంగా మారింది! -
ఆ గళంలో...నాగలి
ర్యాప్ సింగర్‌గా సుపరిచితుడైన రోల్‌రైడా బిగ్‌బాస్ సీజన్–2తో అందరికీ మరింత దగ్గరయ్యాడు...! ఎన్నో ర్యాప్, హిప్హాప్ పాటలతో శ్రోతలను అలరించిన రైడా, ర్యాప్ సాంగ్స్‌కి సందేశాత్మకతను జోడించి ప్రత్యేకమైన మార్క్‌ను ఏర్పరచుకున్నాడు. సామాజిక అంశాలను ముడిసరుకుగా తీసుకొని ఆల్బమ్స్ చేసే రోల్‌రైడా.., ఈ సారి రైతుల కథాంశంతో సమస్త మానవాళికి రైతే ఫ్రంట్వారియర్ అంటూ ‘నాగలి’ ర్యాప్‌తో వస్తున్నాడు...! సాక్షి,సిటీబ్యూరో: మ్యూజిక్‌లో ర్యాప్ సాంగ్స్ అనేవి విభిన్నమైనవి. అంతర్జాతీయంగా దానికంటూ ప్రత్యేకంగా మ్యుజిషియన్స్ ఉన్నారు. ఎన్నో పాశ్చాత్య సంగీత శైలుల్ని అందిపుచ్చుకోగలిగినా.. తెలుగులో ర్యాప్సింగర్స్ మాత్రం కొందరే ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకంటూ ప్రత్యేకించిన ర్యాప్ పాటలతో యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయ్యాడు రోల్‌రైడా. ‘అరుపు’..ఓ పిలుపు... విభిన్నమైన కాన్సెప్టులతో పలు ర్యాప్, హిప్హప్ సాంగ్స్ చేశాడు రైడా. ముఖ్యంగా మహిళలపైన, చిన్నారులపైన జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలను ప్రతిస్పందిస్తూ ‘అరుపు’ పేరుతో చేసిన ర్యాప్‌సాంగ్ విశేషమైన ఆదరణ పొంది కోట్ల సంఖ్యలో వీక్షకుల్ని సొంతం చేసుకుని, ఎంతోమందిని ఆలోచింపజేసింది. అతిసున్నితమైన అంశాలని హృదయానికి హత్తుకునేలా మ్యూజిక్‌ని, సాంగ్ వెర్షన్‌ని రోల్‌రైడా ఎంచుకుంటాడు. రైడా ర్యాప్ సింగర్ మాత్రమే కాకుండా మంచి రైటర్ కూడా. తన ర్యాప్స్‌తో సినిమాల్లో కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రముఖ టాలివుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల కోసం పలు సినిమాలకి సైతం ర్యాప్ సాంగ్స్ పాడాడు. రైతులే ఫ్రంట్వారియర్స్... కరోనా లాక్డౌన్లో ప్రపంచ జీవన విధానమే మారిపోయింది. కానీ మనిషి ఆకలి మాత్రం మారలేదు. ఏది లేకపోయినా సర్దుకున్నాం కానీ ఆకలికి ఓర్చుకోలేకపోయాం. ‘‘ఆహారం లేకపోతే మనిషికి మనుగడే లేదు. మనిషికి అంత ముఖ్యమైన ఆహారాన్ని, అదీ మట్టి నుండి పండిస్తున్న∙రైతుకు మాత్రం సానుభూతి తప్ప తగినంత గుర్తింపు రాలేదు’’ అంటున్నాడు రైడా. గుర్తింపు అటుంచితే సగటు మనిషి సామాజిక, ఆర్థిక జీవనానికి ఎంతో దూరంలో బ్రతుకు బండిని నెట్టుకొస్తున్నాడు. అసలు రైతే లేకుంటే ఏంటి పరిస్థితి., రైతుకు కోపమొస్తే ఏం జరుగుతుంది అనే ఆలోచనతోనే ‘నాగలి’ని రూపొందించానన్నారు. ‘‘ఇది ‘అరుపు టీం’ నుండి వస్తున్న మరో సందేశాత్మక ప్రయోగం. సమాజానికి రైతులే ఫ్రంట్వారియర్స్ అని, వారి స్థితిగతులను, మానవీయ కోనాలను, మానసిక వేదనలను ఇందులో పొందుపరిచామని’’ రైడా తెలిపారు. ఈ ‘నాగలి’లో రైడాతో పాటు బిగ్‌బాస్‌లో అలరించిన ‘అమిత్ తివారి’ కూడా లీడ్‌రోల్‌గా చేశాడు. దీనికి రైడా లిరిక్స్ రాసి, ర్యాప్ పాడగా హరికాంత్ దర్శకత్వం చేశాడు. దీనంతటికి ఆత్మ అయినటువంటి మ్యూజిక్‌ని ప్రవీణ్ లక్కరాజు సమకూర్చాడు. నాగలి ట్రైలర్‌ని శనివారం రిలీజ్ చేయగా.., ఈ ర్యాప్సాంగ్ని స్వాతంత్ర దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల కోసం రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తుందని రైడా చెప్పారు. -
‘రాదు’కున్న సాంగ్
రెండు నెలల క్రితం బంజారాహిల్స్‌లో డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుపడిన ఓ కుర్రాడు పోలీసులతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ‘మీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు’ అంటూ వారితో సంభాషించిన మితీష్.. ఇప్పుడు టిక్‌టాక్, ఫేస్బుక్, ఇన్స్ట్రాల్లో సెలబ్రిటీ అయిపోయాడు. డ్రంకన్ డ్రైవ్ చేయొద్దన్న సందేశంతో డిసెంబర్ 30న బిగ్‌బాస్ ఫేం రోల్‌రైడా మితీష్‌తో కలిసి ఓ సాంగ్ పాడారు. ఈ పాట వారం రోజుల్లో మిలియన్ వ్యూస్ సాధించింది. ఆ కథాకమామీషు రోల్‌రైడా, మితేష్లు ‘సాక్షి’తో పంచుకున్నారు. శ్రీనగర్‌కాలనీ: ఒక పదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, అది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన ఓ కుర్రాడు పోలీసులతో మాట్లాడిన ‘రాదు’ అనే పదంతో ఓ సాంగ్ వస్తుందని ఆ కుర్రాడు సహా ఎవరూ ఊహించి ఉండరు. కొద్ది రోజులుగా ‘రాదు’ అనే పదం వైరల్ అయింది. ఇంకా గుర్తుకు రాలేదా.. అదేనండి రెండు నెలల క్రితం బంజారాహిల్స్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికి పోలీసులతో ‘మీకు గవర్నమెంట్ స్పెల్లింగ్, సైకాలజీ స్పెల్లింగ్ వచ్చా.. రాదు...రాదు’ అంటూ వారితో సంభాషించిన మితీష్.. అలియాస్ మిట్టు, మ్యాడీ ఇటీవలి కాలంలో టిక్‌టాక్, ఫేస్బుక్, ఇన్స్ట్రాలలో ‘రాదు’ అనే డైలాగ్‌తో వైరల్ అయ్యాడు. కొత్తగా డిసెంబర్ 30న ఎంటర్టైన్మెంట్గా సాగుతూ డ్రంకెన్ డ్రైవ్ చేయొద్దు అనే సందేశంతో కూడిన సాంగ్‌ను బిగ్‌బాస్ ఫేం రోల్‌రైడా మితీష్‌తో కలిసి పాడారు. ఈ సాంగ్ వారంలో రోజుల్లో మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా మితీష్ ‘రాదు’ అనే పదం గురించి, రోల్‌రైడా సాంగ్ గురించి ‘సాక్షి’తో మాట్లాడారు.అవి వారి మాటల్లో.. ఇంత వైరల్ అవుతుందనుకోలేదు.. నా పేరు డి.మితీష్ సన్నిహితులు మిట్టు, మ్యాడీ అంటారు. ఇంటర్ తర్వాత డిప్లొమాతో చదువు ఆపేసి ఈ కామర్స్‌లో బిజినెస్ చేస్తున్నా. అక్టోబర్ 28న ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా సంతోషంలో డ్రింక్ చేశా. ఆ తర్వాత డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికి ఆవేశంలో ట్రాఫిక్ పోలీసులతో సంభాషించాను. మీకు కనీసం గవర్నమెంట్, సైకాలజీ స్పెల్లింగ్ రాదు.. రాదు అని మాట్లాడాను. ఆ రోజు మాట్లాడిన దానికి చాలా బాధపడ్డా. పోలీసులు నా కారణంగా ఇబ్బందిపడ్డారు. నాకు తెలియకుండానే నేను మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవాక్కయ్యాను. కొద్ది రోజుల తర్వాత ‘రాదు’ అనే పదంతో డబ్‌స్మాష్‌లు, టిక్‌టాక్‌లో వీడియోలు, ఫేస్బుక్లో రావడంతో చాలా ఫోన్స్ వచ్చాయి. రేడియో మిర్చి నుంచి కూడా కాల్స్ వచ్చాయి. నాతో రేడియోలో మాట్లాడించారు. ఫ్రెండ్స్ కూడా నువ్వు సెలెబ్రిటీ అయిపోయావ్‌రా అంటూ సోషల్ మీడియాలో ఆటపట్టించారు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఫేం రోల్‌రైడా నాకు ఫోన్ చేశారు. రాదు అనే పదం బాగా వైరల్ అయింది. మనం సోషల్ మెసేజ్‌తో ఎంటర్టైన్గా ఓ వీడియో సాంగ్ చేద్దాం అని చెప్పారు. డిసెంబర్ 31న చాలా మంది తాగి వాహనాలు నడుపుతారని తెలిసి కొద్దిగా అయినా మార్పు వస్తుందని 30న పాట రిలీజ్ చేశాం. ఆ సాంగ్‌కు బాగా క్రేజీ వచ్చింది. వారంరోజుల్లోనే మిలియన్‌కుపైగా వ్యూస్ సాధించింది. చాలా సంతోషంగా ఉంది. నిజంగా డ్రంకెన్ డ్రైవ్ చేయడం తప్పు, ఇంకోసారి ఆ తప్పు చేయను.. ఎవరూ డ్రంకెన్ డ్రైవ్ చేయకూడదని కోరుతున్నాను. – మితీష్ ‘రాదు’ పాటను ఆలపించిన గాయకులు వీరే.. మార్పు కోసం.. రాదు అనే పదం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో మితీష్ను కలిశాను. సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాలను, పలు అంశాలను ప్రస్తావిస్తూ, మెసేజ్‌తో వీడియో సాంగ్ చేద్దాం అని చెప్పాను. సాంగ్‌ను ముందుగానే రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ సంవత్సరం చివరిరోజు చాలా మంది తాగి వాహనాలు నడుపుతారు. 2015లో సికింద్రాబాద్ వద్ద నా కళ్ల ముందే మోటార్ సైకిల్‌పై డ్రంకెన్ డ్రైవ్ చేసి ఇద్దరు చనిపోయారు. కొద్దిగా అయినా మార్పు వస్తుందని కమ్రాన్ మ్యూజిక్‌తో వీడియో రాప్ సాంగ్‌ను రూపొందించి చివరిలో మితీష్‌తో డ్రంకెన్ డ్రైవ్ చేయొద్దని మెసేజ్ ఇచ్చాం. వారం రోజుల్లోనే మిలియన్ వ్యూస్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎవరూ డ్రంకెన్ డ్రైవ్ చేయొద్దని కోరుకుంటున్నాను. – రోల్ రైడా, సింగర్ -
‘మీ టూ’ కంటే ముందే.. మనీషా
అవును.. వారి ‘అరుపు’లో నిజాయితీ ఉంది.. ఎమోషన్ ఉంది.. ఒక బృందం కష్టంతో పాటు చిత్తశుద్ధి ఉంది. అందుకే ఆ తెలుగు వీడియో అంతర్జాతీయ వేదికపై కేక పుట్టించింది. చూసిన వారందరినీ కంట తడి పెట్టించింది. శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ అవార్డుని దక్కించుకుంది. ‘అరుపు’ వీడియో టీమ్‌ని పలకరించినప్పుడు తమ వీడియో ప్రారంభం నుంచి అవార్డు వరకు జర్నీ విశేషాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘అరుపు’ అలా మొదలైంది..రోల్‌రైడా ‘ఆసిఫా’ ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది. ఆడ శిశువనే కారణంతో ఆరునెలల బిడ్డని తల్లిదండ్రులే కర్చిఫ్ నోట్లో కుక్కి చంపేశారని ఫ్రెండ్ చెబితే కలవరపడ్డాను. వెంటనే పాట రాశాను. తర్వాత ఇలాంటి ప్రాజెక్ట్ ఉంటే చెప్పమన్న ప్రొడ్యూసర్స్‌కి సాంగ్ పంపించాం. వారికి నచ్చింది. డైరెక్టర్ హరికాంత్ని వారికి కలిపించాను. లిరిక్స్ రికార్డ్ చేసి, నా వరకు వీడియో రికార్డ్ చేసి నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లిపోయాను. అంతే, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కాన్సెప్టే డిఫరెంట్‌గా చేశారు.. నిజరూపానికి ప్రతిబింబాన్ని అద్దంలో చూస్తాం. అలా మనకు కళ్లకు కనిపించేది వాస్తవం కాదు. అసలు నిజం ఏంటో తెలుసుకోవాలి. కంటికి చాలా మాములుగా కనిపించే ఎన్నో విషయాల వెనుక ఎన్నో భయంకర విషాదాలు ఉండవచ్చు. అందుకే ఈ కాన్సెప్ట్‌ని ఇలా రెడీ చేశాం. కమరాన్ చాలా కష్టపడ్డాడు. మనీషా బాగా పాడింది. తర్వాత మేం షూట్ కోసం అడిగాం. ఆమె ఒప్పుకుంది. కానీ ఆమెకు షూట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామో అర్థం కాలేదు. వీడియో పూర్తయ్యాక మెచ్చుకుంది. ప్రాజెక్ట్ విలువ రూ.27 లక్షలు.పోస్ట్ ప్రొడక్షన్‌కి, వీఎఫెక్ట్కి ఎక్కువ సమయం పట్టింది. తర్వాత ఏం జరిగింది..కమరాన్, మ్యూజిక్ కంపోజర్ సీరియస్ ఇష్యూస్‌ని తీసుకుని ర్యాప్ వీడియోలు చేయాలని ముందు నుంచే ఉంది. కానీ స్టార్టింగ్‌లోనే ఇలాంటి పాట చేసి ఉంటే మమ్మల్ని ఎవరూ గుర్తించేవారు కాదు. ఇప్పుడు మాకు ఒక లిజనర్షిప్ ఉంది. అది రైడా ఫీలై రాసేసరికి ఇక ఆలస్యం చేయకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. రైడా డెమో ట్రాక్ పాడించి పెట్టాం. తర్వాత తను బిగ్‌బాస్‌కి వెళ్లిపోయాడు. దాని మీదే రైడా షూట్ కూడా జరిగింది. మనీషా యూఎస్ నుంచి రావడానికి 20 రోజుల టైం ఉండే. అప్పుడు ఈ ఎఫెక్ట్స్ చేసి పెట్టాను. ఆమె ఇంగ్లిష్‌లో పాడుతుంది, డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు. సినిమాకి మ్యూజిక్ స్క్రిప్ట్ పరంగా చేయాలి. ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి ఉన్న పవర్ ఏంటంటే,ఆర్టిస్ట్‌కి నచ్చింది చేసే స్వేచ్ఛ ఉంటుంది.. నిజాయితీగా చేస్తారు. దాంతో వినే వారు కనెక్ట్ అవుతారు. అందుకే చేస్తున్నప్పుడు జనాల్లోకి వెళుతుందా లేదా అనే డౌట్ రాదు. ఈ వీడియోకి చాలా హ్యూజ్ రెస్పాన్ వచ్చింది. ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారు. పతంగ్ తర్వాత మళ్లీ అంత రెస్పాన్స్ ఇంది. ప్రొడ్యూసర్లు కూడా ఒక్క ప్రశ్న వేయకుండా సపోర్ట్ చేశారు. ‘మీ టూ’ కంటే ముందే.. మనీషా ఇది రోల్‌రైడా ఐడియా. అమ్మాయిలపై లైంగిక హింస, వేదింపులు అనేక అంశాలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మన దగ్గర ‘మీ టూ’ కంటే ముందే ఈ వీడియో విడుదలైంది. ‘మీ టూ’ వంటి మూమెంట్ వల్ల మార్పు వెంటనే వస్తుందని చెప్పలేం. కానీ అందరూ దీని గురించి మాట్లాడతారు.. ఆలోచిస్తారు. అవగాహన పెరుగుతుంది. మార్పుకి మార్గం ఏర్పడుతుందని భావిస్తాను. మీ గురించి... వీడియో గురించి.. ‘నేను లోకల్, మహానుభావుడు, సవ్యసాచి, ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల్లో పాడాను. మాషప్స్ చేస్తుంటాను. అది చూసి రోల్, కమరాన్ ఏదైనా ప్లాన్ చేద్దామన్నారు. నేను పాడిన లిరిక్స్, కోరస్ కృష్ణకాంత్ రాశారు. మిగతాది రోల్‌రైడా రాశారు. ఈ పాటను యూఎస్ నుంచి వచ్చి పాడాను. తర్వాత వీడియోలో కూడా ఉంటే బాగుంటందన్నారు. గంటలో షూటింగ్ అయిపోయింది. చాలా మంచి రివ్యూస్, ఫీడ్‌బ్యాక్ వచ్చాయి. కొంతమంది ఈ వీడియో చూసి మాకు ఏడుపొచ్చింది అని మెసేజ్ చేశారు. అంతకంటే గొప్ప రివ్యూ ఏం ఉంటుంది? ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణమిదీ..సునీల్ గడ్డమేడి,వీడియో ప్రొడ్యూసర్ నేను ఓ ఈవెంట్లో రైడాను కలిసినప్పుడు తెలుగులో ఎక్కువగా మ్యూజిక్ వీడియోలు వేడుకలు, పండుగలు, సంబురాల మీదనే ఉన్నాయి. అలా కాకుండా వెస్ట్రన్ మ్యూజిక్‌లో సీరియస్ ఇష్యూస్‌ని.. ముఖ్యంగా స్త్రీల సమస్యలను చూపవచ్చు కదా అని సూచించా. అయితే, అలాంటివి చేయాలని తనకున్నా ప్రొడ్యూసర్లు ముందుకు రారని రైడా అన్నారు. స్త్రీ సాధికారతపై వీడియో ప్లాన్ చేస్తే చెప్పమన్నాం. తను ఈ రికార్డింగ్ పంపితే విన్నా.. బాగా నచ్చింది. వెంటనే ప్రాజెక్టుకు ఓకే చెప్పాం. ముప్పైవేల డాలర్లు ఖర్చవుతుందన్నారు. శ్రీని శ్రీగద నా ఫ్రెండ్. ఈ ప్రాజెక్ట్‌కి ఎక్కువ బడ్జెట్ అవసరం కావడంతో తనని అడిగాను. వెంటనే ఏ వివరాలు అడగకుండా ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. మూడు నెలల్లో పూర్తి చేశాం. ఎక్కువ ప్రమోషన్ చేయకుండానే వీడియో పాపులర్ అయింది. ఇకపై కూడా అర్థవంతమైన ప్రొడక్షన్స్ చేస్తాం. పరిచయం లేనివారు కూడా వివరాలు తెలుసుకొని ఫొన్ చేసి చక్కటి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఒక్కటే బాధ, యాదృచ్ఛికంగా ‘మీ టూ’ సమయంలో ఈ వీడియో విడుదలైంది. అయినా ఫెమినిస్టులు, సెలబ్రిటీలు ఈ వీడియో గురించి మాట్లాడ్డం గానీ, ట్వీట్ కానీ చేయలేదు. అదే కొంచెం వెలితి. అంతర్జాతీయ పురస్కారం.. ‘అరుపు’ మ్యూజిక్ వీడియోలో రోల్‌రైడా, మనీషా పాడడంతో పాటు నటించారు. హరికాంత్ గుణమగరి దర్శకత్వం వహించిన ఈ వీడియోకి మ్యూజిక్ స్కోర్ అందించింది కమరాన్. ఈ వీడియోని యూ–ట్యూబ్‌లో 50 లక్షల మందికి పైగా వీక్షించారు. శాన్ఫ్రాన్సిస్కో న్యూ కాన్సెప్ట్ ఫిలిం ఫెస్టివల్ యూఎస్ఏ అవార్డు దక్కించుకుంది. భారత్ నుంచిఎంపికైన ఏకైక చిత్రం ‘అరుపు’ మాత్రమే. ప్రొడ్యూసర్స్ సునీల్ గడ్డమేడి, శ్రీని శ్రీగదని ఈ ఫెస్టివల్‌కి ఆహ్వానించారు. ఈ వీడియో ‘ది బెస్ట్’గా అవార్డు అందుకుంటుందని ఎప్పుడూ ఊహించలేదంటోంది ఈ వీడియో బృందం.