రేపటితో బిగ్‌బాస్ షో కథ క్లోజ్ కానుంది. శ్రీసత్య ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఐదుగురు మిగిలారు. వీరంతా ఫైనల్‌కు చేరుకున్నామన్న సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇకపోతే గత బిగ్‌బాస్ సీజన్లలో అలరించిన కొందరు కంటెస్టెంట్లతో త్వరలో బీబీ జోడీ రానుంది. ఈ షోలో ముక్కు అవినాష్- అరియానా, అఖిల్-తేజస్వి, అర్జున్- వాసంతి, సూర్య- ఫైమా, రవికృష్ణ- భాను, మెహబూబ్- అషు, చైతు- కాజల్, రోల్ రైడా-స్రవంతి జంటలుగా పాల్గొననున్నారు.
ఈ షోను ప్రమోట్ చేసే క్రమంలో నేడు అషు, మెహబూబ్, అవినాష్, అరియానా హౌస్‌లో అడుగుపెట్టారు. ఇక ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన అవినాష్ ఇంట్లో బెల్లీ డ్యాన్స్, నాగిని డ్యాన్స్ చేసి అందరినీ నవ్వించారు. మరి మాజీ కంటెస్టెంట్ల రచ్చ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే!
చదవండి: డబ్బు కోసమే వచ్చానన్న శ్రీసత్య ఎంత సంపాదించిందంటే?
తుస్సుమన్న అవతార్ 2, ఆసినిమాను కూడా దాటలేకపోయింది
Comments
Please login to add a commentAdd a comment