ఘనంగా ముక్కు అవినాష్‌ పెళ్లి, ‘బ్లండర్‌ మిస్టేక్‌’ అంటూ వీడియో బయటికి! | Mukku Avinash Marriage With Anuja Ram Prasad And Ariyana Glory Others Wishes Him | Sakshi
Sakshi News home page

Mukku Avinash Marriage: ‘బ్లండర్‌ మిస్టేక్‌’ అంటూ పెళ్లి వీడియో షేర్‌ చేసిన రాంప్రసాద్‌

Published Wed, Oct 20 2021 2:46 PM | Last Updated on Sat, Oct 23 2021 12:09 AM

Mukku Avinash Marriage With Anuja Ram Prasad And Ariyana Glory Others Wishes Him - Sakshi

టీవీ కమెడియన్‌, మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ముక్కు అవినాష్‌ వివాహ వేడుక ముగిసింది. ఇటీవల తన చిన్ననాటి స్నేహితురాలైన అనుజను నిశ్చితార్థం చేసుకున్న అవినాష్‌ ఈ రోజు ఆమె మెడలో మూడు మూళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది నటీనటుల మధ్య అవినాష్‌ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్స్‌ దివి, అరియాన గ్లోరీ, సయ్యద్‌ సోహైల్‌తో పాటు పలువురు వివాహ వేడుకకు హజరై సందడి చేశారు.

చదవండి: పెళ్లి కొడుకుగా ముస్తాబైన ముక్కు అవినాష్‌..ఫోటోలు వైరల్‌

ఇక అవినాష్‌, అనుజ మెడలో తాళి కడుతున్న వీడియోను కమెడియన్‌ రాంప్రసాద్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అయితే అవినాష్‌ తన పెళ్లి వీడియోను తన సొంత యుట్యూబ్‌లో చానల్‌ ద్వారా విడుదల చేసి అందరికి సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్నాడు. కానీ ముందుగానే రాంప్రసాద్‌ ‘సారీ అవినాష్‌ బ్లండర్‌ మిస్టేక్‌ జరిగింది. కానీ తప్పడం లేదు’ అంటూ పెళ్లి వీడియోను షేర్‌ చేశాడు. అలాగే అరియాన, దివితో పాటు పలువురు నటీనటులు పెళ్లి ఫొటోలను షేర్‌ చేస్తూ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

చదవండి: పూజా నాకొక్కడికే స్పెషల్‌ అనుకున్నా.. కానీ కాదు: అల్లు అర్జున్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement