Bigg Boss 6 Telugu BB Cafe: Ariyana Glory Interview With Spy Akka - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: కంటెంట్‌ రేవంత్‌ వెనకాల పరిగెడుతోంది..

Published Tue, Oct 11 2022 5:00 PM | Last Updated on Thu, Oct 13 2022 3:56 PM

Bigg Boss 6 Telugu: Ariyana Glory Interview with Spy Akka - Sakshi

ప్రతి బిగ్‌బాస్‌ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌, టాస్కులు అంటూ వాటి వెనక పరుగులు తీస్తుంటారు కంటెస్టెంట్లు. కానీ ఈ సీజన్‌లో మాత్రం అదిగో కెమెరా, ఇదిగో కంటెంట్‌ అంటూ కాస్త అతి చేస్తున్నారు. ఆరో సీజన్‌ మొదలై ఐదు వారాలు పూర్తవుతున్నా ఇప్పటికీ కొందరు పూర్తిగా గేమ్‌లో దిగనేలేదు. అదేమంటే బిగ్‌బాస్‌ అంటే గేమ్‌ ఒక్కటే కాదని పాఠాలు వల్లిస్తున్నారు. అందులో రోహిత్‌, మెరీనా జంట కూడా ఉంది. కిచెన్‌లో ఎంతో కష్టపడే మెరీనా తన మంచితనంతోనే హౌస్‌లో నెట్టుకొస్తోంది. కానీ అదొక్కటే ఉంటే సరిపోదు కదా! అన్నింట్లోనూ ఉండాలి. బిగ్‌బాస్‌ షోపై రివ్యూలు ఇచ్చే స్పై అక్క కూడా ఇదే అంటోంది.

మెరీనా- రోహిత్‌ ఎందుకుంటున్నారో తెలియడం లేదని వారి గాలి తీసేసింది. ఈ మేరకు బిగ్‌బాస్‌ కెఫెలో అరియానా గ్లోరీ కాలిఫోర్నియాలో ఉంటున్న స్పై అక్కతో వీడియో కాల్‌లో మాట్లాడింది. ఫెమినిస్ట్‌ పదానికి గొప్ప అర్థం తెచ్చిన మహానుభావుడు సూర్య.. అంటూ అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. చాలామంది సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారు. మెరీనా- రోహిత్‌ అసలు గేమే ఆడటం లేదు. గీతూ 24 గంటలు కంటెంట్‌ అంటూ కెమెరాలు ఎక్కడ ఫోకస్‌ చేస్తే అక్కడ ఉంటుంది. తనే కాదు, అందరూ కంటెంట్‌ వెనకాల పరిగెడుతుంటే రేవంత్‌ వెనక కంటెంట్‌ పరిగెడుతోంది. బాలాదిత్య నా అంచనాలను తారుమారు చేస్తున్నాడు అంటూ ఈ సీజన్‌పై రివ్యూ ఇచ్చింది.

చదవండి: బ్యాటరీ రీచార్జ్‌ టాస్క్‌.. ఏడ్చేసిన శ్రీహాన్‌, శ్రీసత్య
చెల్లో షో బాలనటుడు మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement