బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ పలు భాషల్లో ప్రసారమవుతోంది. తెలుగులో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఐదో సీజన్ కొనసాగుతోంది. సోషల్ మీడియా సెన్సేషన్లను, యూట్యూబ్ స్టార్ల మీద ఫోకస్ పెట్టిన బిగ్‌బాస్ నిర్వాహకులు ఈసారి కూడా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ముఖాలనే హౌస్‌లోకి పంపించారు. కానీ రోజులు గడిచేకొద్దీ వారి ఆటతో, కొట్లాటలతో, లవ్ ట్రాకులతో చాలా తొందరగానే ఫేమస్ అయ్యారు.
ఇదిలా వుంటే పలువురు కంటెస్టెంట్లకు బయట సెలబ్రిటీల నుంచి సపోర్ట్ గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. సీనియర్ నటి ప్రియకు గత సీజన్ బిగ్‌బాస్ రన్నరప్ అఖిల్ సార్థక్ మద్దతిస్తుండగా మానస్‌కు హీరో సందీప్ కిషన్ సపోర్ట్ చేస్తున్నాడు. సన్నీకి బుల్లితెర సెలబ్రిటీల సపోర్ట్ ఉండనే ఉంది. తాజాగా ఆర్జే కాజల్‌కు మద్దతూ పలుకుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చింది హరితేజ. మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన హరితేజ కాజల్ కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందని, అందులో సందేహమే లేదంటోంది. ఈ వారం నామినేషన్‌లో ఉన్న ఆమెకు అభిమానులందరూ ఓట్లు వేసి సేవ్ చేయాలని కోరుతోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన కాజల్ తప్పకుండా టాప్ 5లో ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది. అప్పటివరకు ఆమెకు అందరూ సపోర్ట్ చేయమని అభ్యర్థించింది.
Comments
Please login to add a commentAdd a comment