ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌ను బిగ్‌బాస్ మెగా ఛీఫ్ ప్రేరణతో మొదలుపెట్టాడు. షీల్డ్ అందుకోవడానికి అనర్హులైన ఐదుగురిని గేమ్‌లో నుంచి తీయాలన్నాడు. గేమ్‌లో ఎవరు ఉండకూడదనుకుంటున్నారో వారి ఎగ్స్‌ను పాము నోట్లో పెట్టాల్సి ఉంటుంది. దీంతో ప్రేరణ... విష్ణుప్రియ, పృథ్వీ, గంగవ్వ, హరితేజ, గౌతమ్‌లను సైడ్ చేసింది.
ప్రేరణ జోలికొస్తే విష్ణును తీసేస్తానన్న పృథ్వీ
అనంతరం హౌస్‌మేట్స్‌ను జంటలుగా పిలిచి.. వాళ్లు ఎవర్ని తీసేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ కంటెస్టెంట్ ఎగ్‌ను పాము నోట్లో వేయమన్నాడు. అలా విష్ణుప్రియ, పృథ్వీని పిలిచాడు. విష్ణు.. ప్రేరణను తీసేద్దామనడంతో పృథ్వీ సరేనని తలాడించాడు. ఇక హరితేజ- రోహిణి వంతు వచ్చింది. హరితేజ.. అవినాష్‌ను తీసేయాలనుకుంటున్నట్లు చెప్పింది.
నిఖిల్‌ను తీసేద్దామన్న రోహిణి
అయితే రోహిణి.. నిఖిల్ తనంతట తానుగా అవుట్ అయ్యేందుకు రెడీ ఉన్నప్పుడు ఆ పని మనమే చేసేస్తే అయిపోతుందిగా అని తన అభిప్రాయం చెప్పింది. అది హరితేజకు మింగుడుపడలేదు. అటు యష్మి-తేజ సైతం ఎవర్ని తీసేయాలన్నదాని గురించి ఏకాభిప్రాయానికి రాలేదు. ఇక నిఖిల్ తనను తీసేయమని చెప్పడానికి ప్రత్యేక కారణం ఉంది. ఎవిక్షన్ పాస్ వల్ల సేవ్ అవడం అతడికి ఏమాత్రం ఇష్టం లేదు.
నిఖిల్ ప్లాన్ అదే
నామినేషన్స్‌లో ఉంటేనే తనకు ఓట్ బ్యాంక్ పెరుగుతుందని.. అది తన విజయానికి దోహదపడుతుందని భావిస్తున్నాడు. అందుకే ఎవిక్షన్ షీల్డ్‌తో తనను తాను కాపాడుకోవడానికి సుముఖత చూపించడం లేదు. ఒకవేళ నిజంగా ఆ షీల్డ్ గెలుచుకున్నా తనకోసమైతే వాడుకోనని.. వేరేవారికోసమే ఉపయోగిస్తానని స్పష్టంగా చెప్పేశాడు.
చదవండి: బిగ్‌బాస్ 8.. డేంజర్ జోన్‌లో ఆమె.. వేటు పడటం గ్యారంటీ!
Comments
Please login to add a commentAdd a comment