Bigg Boss 8: ఈసారి ఆమె ఎలిమినేషన్ తప్పదేమో? | Bigg Boss 8 Telugu Elimination Update: Hari Teja And Yashmi Goutham In Danger Zone, Today Promo Video Goes Viral | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Elimination: డేంజర్ జోన్‌లో ఆమె.. వేటు పడటం గ్యారంటీ!

Published Fri, Nov 8 2024 1:00 PM | Last Updated on Fri, Nov 8 2024 1:38 PM

Bigg Boss 8 Telugu Update Hariteja Elimination Rumour

బిగ్‌బాస్ 8లో ప్రస్తుతం పదకొండో వారం నడుస్తోంది. ఈసారి గౌతమ్, నిఖిల్, యష్మీ, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, హరితేజ.. నామినేషన్స్‌లో ఉన్నారు. ఓవైపు హౌసులో మెగాచీఫ్ అయ్యేందుకు పోటీ నడుస్తోంది. ఇంతకీ మెగా చీఫ్ అయ్యిందెవరు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అ‍య్యే అవకాశముంది?

మొన్నటివరకు హౌసులో కన్నడ బ్యాచ్ హవా నడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతిసారి నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీలలో ఒకరో ఇద్దరో నామినేట్ అయ్యేవారు. దీంతో ఒకరి ఫ్యాన్స్ మరొకరిని సపోర్ట్ చేస్తూ గండం నుంచి తప్పించేవాళ్లు. ఈసారి అందరూ నామినేషన్స్‌లో ఉండేసరికి ఎవరి ఓట్లు వాళ్లకే పడుతున్నాయి. ఇది గౌతమ్‌కి కలిసొచ్చింది.

(ఇదీ చదవండి: పృథ్వీనే కొట్టాలనుకున్న విష్ణు.. యష్మి ఎంత పని చేసింది?)

ఈ వారం ఓటింగ్‌లో గౌతమ్.. టాప్‌లో కొనసాగుతున్నాడట. రెండో ప్లేసులో నిఖిల్ ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత స్థానాల్లో వరసగా ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ ఉన్నారట. చివరి రెండు స్థానాల్లో అంటే డేంజర్ జోన్‌లో యష్మి, హరితేజ ఉన్నట్లు తెలుస్తోంది.

గత రెండు వారాల నుంచి హరితేజ.. చివరి స్థానాల్లో ఉంటూ వస్తోంది. మెహబూబ్, నయని పావని ఎలిమినేట్ కావడంతో సేవ్ అవుతూ వచ్చింది. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చివర్లో ఉన్న విష్ణుప్రియ గానీ యష్మీ గానీ ఎలిమినేట్ కాకపోవచ్చు. దీంతో హరితేజపై వేటు పడటం గ్యారంటీ అనిపిస్తుంది. మరి ఇదే జరుగుతుందా? బిగ్‌బాస్ మరేదైనా ప్లాన్ వేశాడేమో చూడాలి?

(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'కి పోటీగా 'ఇడ్లీ' సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement