ఈ అమ్మాయి | e ammayi movie released on august last week | Sakshi
Sakshi News home page

ఈ అమ్మాయి

Published Tue, Jul 2 2019 3:12 AM | Last Updated on Tue, Jul 2 2019 3:12 AM

e ammayi movie released on august last week - Sakshi

హరితేజ

‘బిగ్‌ బాస్‌’ ఫేమ్, నటి భానుశ్రీ ప్రధాన పాత్రలో దొంతు రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈ అమ్మాయి’. అవదూత వెంకయ్యస్వామి ప్రొడక్షన్స్‌పై దొంతు బుచ్చయ్య నిర్మిస్తున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్‌ సోమవారం ప్రారంభమైంది. దొంతు బుచ్చయ్య మాట్లాడుతూ – ‘‘లేడీ ఓరియంటెడ్‌ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రమేష్‌ తెరకెక్కిస్తున్నాడు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రంలోని నాలుగు పాటలను ఇండోనేషియాలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించనున్నాం. పాటల చిత్రీకరణతో షూటింగ్‌ పూర్తవుతుంది. ఈ నెలలో పాటలు రిలీజ్‌ చేసి, ఆగస్టు చివరి వారంలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. చమ్మక్‌ చంద్ర, సత్తిపండు, ధన్‌రాజ్, భద్రం, చలాకీ చంటి, హరితేజ, గోపాలకృష్ణ, మహేశ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.రవి శంకర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement