Chammak Chandra
-
దిల్ రాజు నుంచి నితిన్, శ్రీముఖి, చమ్మక్ చంద్ర వరకు.. అంతా ఇక్కడి వారే!
చలనచిత్ర రంగంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు తమదైన ముద్ర వేశారు. నటులుగా, హాస్య నటులుగా, గాయకులుగా, దర్శక నిర్మాతలుగా గుర్తింపు పొందారు. నిర్మాతలుగా డి.ప్రభాకర్, దిల్ రాజు, నటులు, హాస్యనటులుగా నితిన్, అదితి, శ్రీముఖి, వెన్నెల కిషోర్, చమ్మక్‌చంద్ర.. ఇలా ఎందరో తెలుగు సినీ జగత్తులో సత్తా చాటి జిల్లాకు పేరు తెచ్చారు. సినిమాలలో సత్తా చాటుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులపై సండే స్పెషల్.. యాంకర్ నుంచి యాక్టర్ దాకా.. నిజామాబాద్ నగరానికి చెందిన శ్రీముఖి యాంకర్‌గా గుర్తింపు పొందారు. సినిమా, టీవీ ప్రోగ్రాములకు యాంకర్‌గా పనిచేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగిన ఆమె.. సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ఆమె కు టుంబ సభ్యులు నిజామాబాద్‌లో ఉండడంతో అప్పుడప్పుడు నిజామాబాద్ వచ్చి వెళ్తుంటుంది. దిల్ రాజు.. నిజామాబాద్ నగరానికి సమీపంలోని నర్సింగ్‌పల్లికి చెందిన దిల్ రాజు.. నిర్మాతగా, డిస్టిబ్యూటర్‌గా సినీ ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఆయన ప్రముఖ నటీనటులందరితో ఎన్నో సినిమాలు తీశారు. ఆయన సొంతూరులో ఇందూరు తిరుమల పేరుతో భారీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. నిర్మాతగా ఎందరినో సినిమా రంగంలోకి తీసుకువచ్చారు. నవ్వుల రారాజు వెన్నెల కిషోర్ కామారెడ్డికి చెందిన కిషోర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అమెరికాలో పనిచేశారు. అప్పట్లో వెన్నెల సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆయన సినీరంగం వైపు మళ్లారు. వెన్నెల సినిమాలో నటించడంతో ఆయన పేరు వెన్నెల కిషోర్‌గా మారిపోయింది. హాస్యనటుడిగా కిషోర్ ఎంతో పేరు సంపాదించారు. ప్రస్తుతం దాదాపు అన్ని సినిమాల్లోనూ కిషోర్ పాత్ర ఉంటుండడం విశేషం. ఉత్తమ హాస్యనటుడిగా ఆయన నంది పురస్కారం కూడా అందుకున్నారు. అప్పుడప్పుడూ కామారెడ్డికి వచ్చి తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులని కలిసి వెళ్తుంటారు. నటీమణిగా ఎదుగుతున్న అదితి.. కామారెడ్డి పట్టణానికి చెందిన అదితి మ్యాకాల్.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె తండ్రి రాంచంద్రం హైదరాబాద్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆమె అర్జున్‌రెడ్డి, జంటిల్మెన్, అమీతుమీ, షాదీ ముబారక్వంటి సినిమాల్లో నటించింది. అలాగే పాష్ పోరీస్, మాయాబజార్ వంటి వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తోంది. నటనతో పాటు కూచిపూడి నృత్యంలోనూ ఆమె రాణిస్తోంది. టాప్ హీరోగా గుర్తింపు పొందిన నితిన్.. నిజామాబాద్‌కు చెందిన సినీ హీరో నితిన్ తొలి సినిమా ‘జయం’తోనే ప్రేక్షకులను మెప్పించారు. తన నటనతో ఇండస్ట్రీలో టాప్ స్టార్లలో ఒకరిగా ఎదిగారు. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు నితిన్ దగ్గరి బంధువు. నితిన్ బందువులు చాలా మంది నిజామాబాద్‌లోనే ఉన్నారు. హాస్యం పండించే చమ్మక్ చంద్ర గాంధారి మండలం వెంకటాపూర్‌కు చెందిన గిరిజన బిడ్డ చమ్మక్ చంద్ర.. తన నటనతో హాస్యం పండిస్తూ అందరినీ మెప్పిస్తున్నారు. టీవీ చానళ్లలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందారు. సినిమాల్లోనూ హాస్య నటుడిగా రాణిస్తున్నారు. ఆయన తరచూ సొంతూరుకు వచ్చి వెళ్తుంటారు. వచ్చినప్పుడల్లా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటారు. సినీ గాయకుడిగా విష్ణుకిషోర్ ఆర్మూర్ మండలం కోమన్‌పల్లికి చెందిన విష్ణుకిషోర్ జానపద గాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి సినీ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎదిగారు. సినిమాల్లోనూ నటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ గీతాలు పాడిన విష్ణుకిషోర్.. ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీకేఆర్ స్టూడియోను స్థాపించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గానూ రాణిస్తున్నారు. భగవాన్ సినిమా నిర్మాత ప్రభాకర్ కామారెడ్డి పట్టణానికి చెందిన నిర్మాత దివంగత డి.ప్రభాకర్ ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా భగవాన్ సినిమాను నిర్మించారు. అప్పట్లో అది సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన నాయకురాలు, ప్లీజ్ నాకు పెళ్లయ్యింది వంటి సినిమాలకు ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అలాగే డి్రస్టిబ్యూటర్గానూ పనిచేశారు. కామారెడ్డిలో ఆయన స్థాపించిన ప్రియా థియేటర్లు రెండు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కామారెడ్డి మున్సిపల్ కాకముందు ఆయన సర్పంచ్‌గానూ సేవలందించారు. నిర్మాతగా రజిత్‌రావ్ అడుగులు.. ఆర్మూర్‌కు చెందిన వ్యాపారవేత్త బల్గూరి రజిత్‌రావ్ సినీరంగంలో అడుగుపెట్టారు. ఇటీవల ‘అన్‌స్టాపబుల్’ చిత్రాన్ని నిర్మించారు. చిన్ననాటి నుంచి సినిమాల మీద ఉన్న మోజుతో ఆయన సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టి గుర్తింపు పొందారు. సినీ, రాజకీయ రంగ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న రజిత్‌రావ్.. నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గేయ రచయితగా రుద్రంగి రమేశ్ మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రుద్రంగి రమేశ్ అనేక సినిమాలకు పాటలు రాశారు. మాస్ పవర్, పోలీస్ పవర్, పోరాటం, మిస్టర్ ఐటం, సినిమా సినిమా, ప్రేమిస్తే చంపేస్తారా, నైజాం సర్కరోడా, రుద్రనాగు, హృదయం, దిల్లున్నోడు, నువ్వంటే ఇష్టం వంటి సినిమాలకు పాటలు రాశారు. అలాగే భక్తి గీతాలు కూడా ఎన్నో రచించారు. -
ఎన్టీఆర్ డైలాగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన: రామ్ అగ్నివేశ్
రామ్ అగ్నివేష్, రేఖ నీరోషా జంటగా వీవీ రుషిక దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇక్షు’. డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో హనుమంతురావు నాయుడు నిర్మించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ మూవీ సక్సెస్ కావడంతో చిత్రబృందం హైదరాబాద్‌లో సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇదే బ్యానర్లో మరో సినిమా మొదటి షెడ్యూల్ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. దర్శకురాలు రుషిక మాట్లాడుతూ.. 'ఇక్షు సినిమా తీయడం నా కల. ఈ చిత్రంలో నా కుమారుడు రామ్ అగ్నివేశ్‌ను హీరోగా చూడడం చాలా సంతోషంగా ఉంది. నా మొదటి మూవీ విజయవంతమైనందుకు ఇదే బ్యానర్‌పై మరో సినిమాను ప్రారంభించాం. ఈ చిత్రంలో పాత్రల కోసం అడిషన్స్ ద్వారా కొందరిని ఎంపిక చేశాం.' అని అన్నారు. చిత్ర నిర్మాత హన్మంతరావు నాయుడు మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు సపోర్ట్ చేసిన దిల్ రాజు, బసిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, దామోదర్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా మేము అనుకున్నంత రీచ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే బ్యానర్‌పై మరో చిత్రాన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీస్తాం' అని అన్నారు. హీరో రామ్ అగ్నివేశ్ మాట్లాడుతూ.. 'నన్ను గ్లామర్‌గా చూపించమని అమ్మను అడిగితే.. ముందు ఆర్టిస్ట్‌గా నిరూపించుకోవాలన్నారు. ఈ సినిమా నాకు ఎంతో నేర్పించింది. ఇక్షులో నేను చెప్పిన ఎన్టీఆర్ డైలాగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రెడిట్ రావడానికి కారణం మా అమ్మ, నాన్నలే.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, ఫిదా, కెప్టెన్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. -
చమ్మక్ చంద్ర.. 'దేవదాసు పారు వల్లే బ్యాడు' సాంగ్ విన్నారా?
సాయి ధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కేవీ ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘షికారు’. ఈ చిత్రానికి హరి కొలగాని దర్శకుడు. నాగేశ్వరి (పద్మ) సమర్పణలో శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్‌పై పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రంలోని ‘దేవదాసు పారు వల్ల బ్యాడు.. మజ్ను లైఫ్ లైలా వల్లే సాడ్’ అనే పాటను విడుదల చేశారు. హరి కొలగాని మాట్లాడుతూ– ‘‘ఎంటర్టైన్మెంట్ను బలంగా నమ్మే వ్యక్తిని నేను. ఓ పాట ద్వారా యువతకు సందేశం చెప్పాలనిపించింది. ‘దేవదాసు పారు వల్ల బ్యాడు..’ అనే పాటను నేనే రాశాను’’అన్నారు. ‘‘సమాజంలోని సంఘటనలను ఈ చిత్రంలో వినోదాత్మకంగా చెబుతున్నాం’’ అన్నారు బాబ్జీ. చదవండి: ఈ ఓటీటీల్లో ఫ్రీగా చూసేయొచ్చు సల్మాన్‌కు కొత్త సబ్బు కనిపిస్తే చాలు బ్యాగులో వేసుకుంటాడట! -
అనసూయ కొత్త చిత్రం: శ్రీనివాస్‌రెడ్డి, చమ్మక్ చంద్రల ట్రాక్ హైలెట్!
‘పేపర్ బాయ్’ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్సెఫ్ట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. సాయికుమార్, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శేషు మారంరెడ్డి మాట్లాడుతూ...జయశంకర్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని కొనియాడారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందని, మిగిలిన భాగాన్ని ఏప్రిల్‌లోపు కంప్లీట్ చేస్తామని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రకు సంబంధించిన సీన్స్‌ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడని, థియేటర్స్‌లో ఆ సీన్స్ తప్పకుండా నవ్వులు పూయిస్తాయని చెప్పారు. జయశంకర్ వర్కింగ్ స్టెల్ చాలా బాగుందని, అందుకే ఆయనతో మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇక దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. నిర్మాతల ప్రొత్సాహంతో సినిమాను అద్బుతంగా తెరకెక్కిస్తున్నామని చెప్పారు. తమ చిత్రానికి అనూప్ సంగీతం చాలా ప్లస్ అవుతుందన్నారు. టైటిల్‌తో పాటు విడుదల తేదిని కూడా త్వరలోనే వెల్లడిస్తామని జయశంకర్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్రానికి ‘గ్రహమ్’అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. -
యువతకి సందేశం
‘‘రామసక్కనోళ్లు’ సినిమా ట్రైలర్ చూస్తుంటే కనీస బాధ్యతలను విస్మరిస్తున్న నేటి యువతకు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు మంత్రి హరీష్ రావు. చమ్మక్ చంద్ర, సలీం షేక్ హీరోలుగా, మేఘనా చౌదరి, షాయాజీ షిండే, బ్రహ్మానందం, నాగినీడు, చలపతి ప్రధాన పాత్రల్లో ఫహీం సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామసక్కనోళ్లు’. సునయన పరాంకుశం సమర్పణలో సతీష్ కుమార్ సాత్పడి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. సతీష్ కుమార్ సాత్పడి మాట్లాడుతూ–‘‘ఓ గ్రామంలో కొందరు పెద్ద మనుషులుగా చలామణీ అవుతూ చేసే అరాచకాలను నలుగురు కుర్రాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? అన్నదే ఈ చిత్రకథ. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం’’ అన్నారు. ‘‘ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్, విశాఖపట్నం, ఊటీలో సినిమా చిత్రీకరించాం’’ అన్నారు ఫమీం సర్కార్. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: జగ¯Œ -
ఈ అమ్మాయి
‘బిగ్ బాస్’ ఫేమ్, నటి భానుశ్రీ ప్రధాన పాత్రలో దొంతు రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈ అమ్మాయి’. అవదూత వెంకయ్యస్వామి ప్రొడక్షన్స్‌పై దొంతు బుచ్చయ్య నిర్మిస్తున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ సోమవారం ప్రారంభమైంది. దొంతు బుచ్చయ్య మాట్లాడుతూ – ‘‘లేడీ ఓరియంటెడ్ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రమేష్ తెరకెక్కిస్తున్నాడు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలోని నాలుగు పాటలను ఇండోనేషియాలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించనున్నాం. పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. ఈ నెలలో పాటలు రిలీజ్ చేసి, ఆగస్టు చివరి వారంలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. చమ్మక్ చంద్ర, సత్తిపండు, ధన్‌రాజ్, భద్రం, చలాకీ చంటి, హరితేజ, గోపాలకృష్ణ, మహేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.రవి శంకర్. -
చెక్కు వాపస్ ఇచ్చిన చమ్మక్ చంద్ర
మోపాల్(నిజామాబాద్ రూరల్): మండ లంలోని తాడెం గ్రామశివారులో ఉన్న భూ మికి సంబంధించిన రైతుబంధు చెక్కు రూ.3700లను జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర సోమవారం ప్రభుత్వానికి తిరిగి ఇ చ్చేశారు. ఈ సందర్భంగా చమ్మక్ చంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం రైతుబంధు ద్వా రా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తుందని, ఇది అభినందించదగ్గ వి షయమన్నారు. తనకు వచ్చిన డబ్బును ప్ర భుత్వానికి తిరిగి చేస్తున్నానని తెలిపారు. తహసీల్దార్ వేణుగోపాల్ గౌడ్, ఆర్ఐ నారాయణ, సీ.అసిస్టెంట్ సంతోష్, సర్వేయర్, ఏఈఓ మహేందర్, వీఆర్వోలు పాల్గొన్నారు. -
విలన్ రోల్లో ఛమ్మక్ చంద్ర
తెలుగు ప్రేక్షకులకు జబర్థస్త్ షోతో హాస్యనటుడిగా పరిచయం అయిన ఛమ్మక్ చంద్ర పలు చిత్రాల్లో కామెడీ రోల్స్ చేసి ఆకట్టుకున్నాడు. అయితే తెలుగులో పూర్తి స్థాయి పాత్రలో ఇంత వరకు కనిపించలేదు చంద్ర. తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ దక్కకపోయినా.. కోలీవుడ్ ఇండస్ట్రీ ఆ అవకాశం ఇచ్చింది. త్వరలో ఓ తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ కామెడీ స్టార్. సెయల్ పేరుతో తెరకెక్కుతున్న తమిళ సినిమాలో చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో చంద్ర విలన్ రోల్ లో కనిపించనున్నాడు. రవి అబ్బులు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజన్ తేజేశ్వర్, థరుషి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద్ధార్థ్ విపిన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను సీఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై సీఆర్ రాజన్ నిర్మిస్తున్నారు. -
విలన్ రోల్లో ఛమ్మక్ చంద్ర
-
'టోల్ ఫ్రీ నెంబర్ 143' టీజర్ లాంఛ్
-
టోల్ ఫ్రీ నెం.143 మూవీ స్టిల్స్
-
‘మాయామహల్’లో వినోదం
ప్రేమ, వినోదం, హారర్ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘మాయా మహల్’. సింగం సుధాకరరెడ్డి దర్శకుడు. ఎం.అంకయ్య నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ నెలలో పాటలను, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. భయపెడుతూనే వినోదాన్ని పంచే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ‘వెన్నెల’కిషోర్, ధన్‌రాజ్, చమక్‌చంద్ర, తిరుపతి ప్రకాష్, అల్లరి సుభాషిణి, చిట్టి, గ్రీష్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యనారాయణ పెండ్రు, కెమెరా: మురళీకష్ణ, సంగీతం: శ్యామ్ప్రభు, సహ నిర్మాతలు: సూరేపల్లి బాలకష్ణ, సూరేపల్లి అనిత.