ఎన్టీఆర్ డైలాగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన: రామ్ అగ్నివేశ్ | Ram Agnivesh Ikshu Movie Success Celebrations In Hyderabad Today | Sakshi
Sakshi News home page

Ikshu Movie Success Meet: ఈ సినిమాతో చాలా నేర్చుకున్నా: రామ్ అగ్నివేశ్

Published Fri, Sep 30 2022 7:37 PM | Last Updated on Fri, Sep 30 2022 7:38 PM

Ram Agnivesh Ikshu Movie Success Celebrations In Hyderabad Today - Sakshi

రామ్‌ అగ్నివేష్, రేఖ నీరోషా జంటగా వీవీ రుషిక దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇక్షు’. డాక్టర్‌ గౌతమ్‌ నాయుడు సమర్పణలో హనుమంతురావు నాయుడు నిర్మించారు.  ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ మూవీ సక్సెస్ కావడంతో చిత్రబృందం హైదరాబాద్‌లో సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇదే బ్యానర్‌లో మరో సినిమా మొదటి షెడ్యూల్ సందర్భంగా కేక్‌ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. 

దర్శకురాలు రుషిక మాట్లాడుతూ.. 'ఇక్షు సినిమా తీయడం నా కల. ఈ చిత్రంలో నా కుమారుడు రామ్ అగ్నివేశ్‌ను హీరోగా చూడడం చాలా సంతోషంగా  ఉంది. నా మొదటి మూవీ విజయవంతమైనందుకు ఇదే బ్యానర్‌పై మరో సినిమాను ప్రారంభించాం. ఈ  చిత్రంలో పాత్రల కోసం అడిషన్స్‌ ద్వారా కొందరిని ఎంపిక చేశాం.' అని అన్నారు.  చిత్ర నిర్మాత హన్మంతరావు నాయుడు మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు సపోర్ట్ చేసిన దిల్ రాజు, బసిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, దామోదర్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా మేము అనుకున్నంత రీచ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే బ్యానర్‌పై  మరో చిత్రాన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీస్తాం' అని అన్నారు.

హీరో రామ్ అగ్నివేశ్ మాట్లాడుతూ.. 'నన్ను గ్లామర్‌గా చూపించమని అమ్మను అడిగితే.. ముందు ఆర్టిస్ట్‌గా నిరూపించుకోవాలన్నారు. ఈ సినిమా నాకు ఎంతో నేర్పించింది. ఇక్షులో నేను చెప్పిన ఎన్టీఆర్ డైలాగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రెడిట్ రావడానికి కారణం మా అమ్మ, నాన్నలే.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, ఫిదా, కెప్టెన్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement