agnivesh
-
ఎన్టీఆర్ డైలాగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన: రామ్ అగ్నివేశ్
రామ్ అగ్నివేష్, రేఖ నీరోషా జంటగా వీవీ రుషిక దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇక్షు’. డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో హనుమంతురావు నాయుడు నిర్మించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ మూవీ సక్సెస్ కావడంతో చిత్రబృందం హైదరాబాద్‌లో సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇదే బ్యానర్లో మరో సినిమా మొదటి షెడ్యూల్ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. దర్శకురాలు రుషిక మాట్లాడుతూ.. 'ఇక్షు సినిమా తీయడం నా కల. ఈ చిత్రంలో నా కుమారుడు రామ్ అగ్నివేశ్‌ను హీరోగా చూడడం చాలా సంతోషంగా ఉంది. నా మొదటి మూవీ విజయవంతమైనందుకు ఇదే బ్యానర్‌పై మరో సినిమాను ప్రారంభించాం. ఈ చిత్రంలో పాత్రల కోసం అడిషన్స్ ద్వారా కొందరిని ఎంపిక చేశాం.' అని అన్నారు. చిత్ర నిర్మాత హన్మంతరావు నాయుడు మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు సపోర్ట్ చేసిన దిల్ రాజు, బసిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, దామోదర్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా మేము అనుకున్నంత రీచ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే బ్యానర్‌పై మరో చిత్రాన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీస్తాం' అని అన్నారు. హీరో రామ్ అగ్నివేశ్ మాట్లాడుతూ.. 'నన్ను గ్లామర్‌గా చూపించమని అమ్మను అడిగితే.. ముందు ఆర్టిస్ట్‌గా నిరూపించుకోవాలన్నారు. ఈ సినిమా నాకు ఎంతో నేర్పించింది. ఇక్షులో నేను చెప్పిన ఎన్టీఆర్ డైలాగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రెడిట్ రావడానికి కారణం మా అమ్మ, నాన్నలే.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, ఫిదా, కెప్టెన్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. -
మమ్మల్ని నమ్మండి.. అన్నీ చేస్తాం
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో పేదలు, వలస కూలీలు ఇబ్బందులకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ విషయంలో తమను విశ్వసించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు పేద ప్రజలు, నిరాశ్రయులు, కూలీలను అన్నివిధాలా ఆదుకోవాలని, ఆ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(పిల్) సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. మెహతా వాదనలను పరిగణనలోకి తీసుకుని అగ్నివేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. లాక్డౌన్ నేపథ్యంలో కాలినడకన స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, మంచినీరుతో పాటు విశ్రమించడానికి సదుపాయాలు కల్పిస్తున్నామని కోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. కాగా, ఆకలి బాధలు తట్టుకోలేక దేశంలోని వివిధ ప్రాంతాల్లో వలస కార్మికులు ఆందోళనలకు దిగుతున్నారు. తిండి గింజల కోసం పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో బెర్హంపూర్-కరీంపూర్ జాతీయ రహదారిపై స్థానికులు బుధవారం బైఠాయించారు. (శ్మశానంలో కుళ్లిన అరటిపండ్లను తింటున్న కూలీలు) నర్సుల సమస్యల పరిష్కారానికి.. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్(యూఎన్ఏ), ఇతర ఆరోగ్య కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లనపై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. నర్సుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వేతనాల్లో కోత, ఆలస్యంగా వేతనాలు ఇవ్వడం, వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. మరోవైపు, దేశంలో పారిశుధ్య కార్మికులకు రక్షణ పరికరాలను అందజేస్తున్నామని, కరోనా నియంత్రణ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని కేంద్ర సర్కారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. చదవండి: మరింత పటిష్టంగా లాక్డౌన్ -
ప్రతీకారేచ్ఛ ప్రమాదకరం
సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌పై ఇటీవల జరి గిన దాడిని సర్వత్రా ఖండించారు గానీ, నిజంగానే ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఆయన గత, ప్రస్తుత అభిప్రాయాలు, ఆచరణతో ఏకీభవించనివారికి తమ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయనను వ్యతిరేకించడం కూడా తప్పు కాదు. కానీ అలా వ్యతిరేకించడానికి ముందు స్వామి అగ్నివేశ్ నేపథ్యంకేసి ఒకసారి పరిశీలించి తర్వాత వారు ఆ పని చేయాల్సి ఉంటుంది. మరొక వైపున, సంఘ్ బ్రిగేడ్‌కి చెందిన హిందుత్వ లంపెన్ శక్తుల నిరంతర హింసాత్మక దాడులతో నిస్పృహ చెందిన కొంతమంది వ్యక్తులు హిందుత్వ ముఠాకు గుణపాఠం చెప్పడానికి దళి తులు, ఓబీసీలు, ఆదివాసీలు, మైనారిటీలతో కూడిన ఐక్య సంఘటనకు పిలుపునిస్తున్నారు. ఈ బృందాలన్నీ కలిసి ఒక్కటై ఎదిరిస్తే హిందుత్వ బ్రిగేడ్ పలాయనం సాగించక తప్పదని కొంతమంది మిత్రులు అంటున్నారు. ఇలా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర హింసకు పాల్పడుతున్నవారిపై ప్రతి హింస కూడా అదే స్థాయిలో చేయడమే పరిష్కారమంటూ సోషల్ మీడియాలో ఒక స్నేహితుడు పేర్కొన్నాడు కూడా. అంటే వాళ్లు నీ కాళ్లు చేతులు విరగ్గొడితే నువ్వు కూడా వాళ్ల కాళ్లూ చేతులను విరగ్గొట్టాలి. వాస్తవానికి ఆరెస్సెస్ ప్రతిపాదిస్తున్న హిందుత్వ, దాని గర్వాతిశయం అనేవి అభద్రతతో కూడిన పరాజిత మనస్తత్వంలోంచే పుట్టుకొచ్చాయి. అందుకే హిందుత్వ భావన ఆవిర్భవించిన నాటినుంచి ప్రతి కూల స్వరాన్నే వినిపిస్తూ పోతోంది. ఈ నేపథ్యంలో హిందుత్వ లంపెన్ శక్తులకు అణగారిన వర్గాల ఐక్య కూటమి సరైన పాఠం చెప్పాలని వస్తున్న నూతన సవాలును సానుకూల ఎంపికగా చెప్పలేం. ఈ వైఖరి కూడా తాత్కాలిక ఉద్రేకాలతో పుట్టుకొచ్చే అపరిణత ఆగ్రహ ప్రకటన కంటే ఉత్తమమైనది కాదు. నిజానికి దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు ప్రస్తుతం ఆరెస్సెస్/బీజేపీకి మరీ దూరంగా ఏమీ లేరు. నయా ఉదారవాద, నయా సామ్రాజ్యవాద విధానాలకు మద్దతు తెలిపే విషయంలో దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు ఇప్పటికే ఆరెస్సెస్, బీజేపీ శక్తులతో చేయి కలిపారు. ఇక ముస్లిం మైనారిటీల విషయానికి వస్తే తమ ఒంటరితనంలో వారు ఎన్నాళ్లు కొనసాగుతూ ఆరెస్సెస్, బీజేపీ ద్వయాన్ని వ్యతిరేకిస్తుంటారనేది ప్రశ్నే. ఎందుకంటే ఇతర పౌరులలాగే వారు కూడా భారతీయులే మరి. మతపరమైన గుర్తింపుతోబాటు రాజకీయాధికారం విషయంలో వీరికి కూడా ఏదో ఒక మద్దతు అవసరం. దేశంలో షియా ముస్లిం తెగను ఆకర్షించడానికి ఆరెస్సెస్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆరెస్సెస్ ఈ విషయంలో నిలకడైన పనితీరును ప్రదర్శించడమే కాకుండా ఫలితాలు కూడా చూస్తోంది. నా రెండో అభిప్రాయం ఏదంటే, ఈ దేశంలోని మేధావులు హిందుత్వ లంపెన్ శక్తులకు గుణపాఠం చెప్పాలన్న పథకంతో అణగారిన వర్గాల ఐక్యసంఘటనకు ప్రయత్నిస్తున్నట్లయితే ఆనాడు లోహియా మరింత ప్రజాస్వామికంగా చేసిన సూచనను మనందరం గుర్తు తెచ్చుకోవాలి. అణగారిన వర్గాల మధ్య ఐక్యతా సూత్రాన్ని లోహియా ప్రతిపాదించారు. పైగా ఆధునిక ప్రపంచంలో ప్రత్యక స్థానం పొందగలిగే కొత్త భారతీయ నాగరికతను నిర్మించాలని ఆయన కలకన్నారు. ఆయన ప్రకారం భారతీయ జనాభాలో అధికభాగం వలసపాలనకు ముందటి బ్రాహ్మణిజం అంతస్తుల వ్యవస్థ నుంచి, వలసపాలనా కాలపు పెట్టుబడిదారీ భావజాలం నుంచి విముక్తి పొందారు. అలాంటి సామాజిక బృందాల సంఘీభావంతో ప్రజాస్వామ్యం ద్వారా రాజ్యాధికారాన్ని పొందగలిగితే ఒక కొత్త సమానతా వ్యవస్థ రూపు దిద్దుకుంటుంది. ఇది బ్రాహ్మణిజం, పెట్టుబడిదారీ విధానంకు పూర్తి భిన్నంగా ప్రపంచం ముందు సరికొత్త నమూనాను నెలకొల్పుతుంది. ఛాందసవాద మనస్తత్వంలో కూరుకుపోని ఈ అణగారిన ప్రజలను ఒకటిగా చేయడం ద్వారా సోషలిజం, కమ్యూనిజాన్ని దేశంలో నిర్మించవచ్చని లోహియా కలగన్నారు. ఈ మార్గంలోనే ఆయన ప్రత్యేక అవకాశాలు (రిజర్వేషన్) సూత్రాన్ని ప్రతిపాదించారు. కానీ లోహియా సూత్రాన్ని ప్రస్తుతం ఓట్ల రాజకీయాల కోసం సామాజిక న్యాయ చాంపియన్లు వాడుకుంటున్నారు. ఆరెస్సెస్, బీజేపీ కూడా ఇదేవిధమైన ఎత్తుగడలతో నడుస్తోంది. అణగారిన వర్గాల ప్రజల మధ్య సంఘీభావం హిందుత్వ లంపెన్ శక్తులకు గుణపాఠం చెప్పడం వైపుగా మరలాలని మన దేశ మేధావులు సూచిస్తున్నట్లయితే, ఓట్ల రాజకీయాలకు సంబంధించి కూడా ఇది వెనుకడుగు అనే చెప్పాలి. కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానం దేశ నాయకులనే కాకుండా, మేధావులను కూడా తనచుట్టూ డ్యాన్స్ చేయిస్తోంది. హిందుత్వ లంపెన్ శక్తులకు ఈ రకంగా గుణపాఠం చెబుదామని అణగారిన వర్గాలకు పిలుపునిస్తున్న మేధావులు గతంలో సంపూర్ణంగా రిజర్వేషన్ వ్యతిరేకులైన అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్‌లకు మద్దతు పలికిన గుంపులో కలిశారని మనం మరవకూడదు. డాక్టర్ ప్రేమ్ సింగ్, హిందీ శాఖ, ఢిల్లీ యూనివర్సిటీ -
అగ్నివేష్‌పై దాడిచేసిన వారిని శిక్షించాలి
వనపర్తి అర్బన్: సామాజిక కార్యకర్త, ఆర్య సమాజ్ ప్రముఖ్, కుర వృద్ధుడైన అగ్నివేష్‌పై దాడి చేయడం అత్యంత అమానుషమని, దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని టిజేఏసీ, ఎమ్మార్పీఎస్, పాలమూరు అధ్యాయన వేదిక, పీడీఎస్‌ఊయూస్‌యు, డీటీఎఫ్ ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. ఆదివారం పట్టణంలోని యాదవ సంఘం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జార్ఖండ్ గవర్నన్‌ను కలిసి గిరిజనుల సమస్యలను విన్నవించి తిరిగి వెళ్తున్న సమయంలో మతోన్మాద గుండాలు ఆయనపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను, లౌకికవాదాన్ని, వాక్స్వాతంత్య్రాన్ని ప్రభుత్వాలు అణగదొక్కేస్తున్నాయని, దేశవ్యాప్తంగా ఎందరో సామాజిక కార్యకర్తలపై దాడులు నిరంతరం చేయడం మతోన్మాద చర్యలను ప్రేరేపించడమేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రభుత్వాలకు ప్రజలకు తగిన రీతిగా బుద్ధి చెప్పే సమయం ఎంతో దూరం లేదని చెప్పారు. అగ్నివేష్‌పై జరిగిన దాడుల్లో పాల్గొన్న వారికి గుర్తించి శిక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. భవిషత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజారాంప్రకాష్, వేణుగోపాల్, బుచ్చన్న, యేసేపు, శ్రీనివాసులుగౌడ్, అగ్గిరాముడు, నారాయణ, శ్రీనివాసులు, పవన్, గోపి, బుచ్చన్న, శాంతన్న, స్వామి, సత్యనారాయణ పాల్గొన్నారు. -
హజారే చనిపోవాలని కేజ్రీవాల్ కోరుకున్నారా?
న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హజారే చేపట్టిన ఆమరణ దీక్ష ఎక్కువ రోజులు కొనసాగి ఆయన చనిపోతే తన రాజకీయ ప్రయోజనాలు నెరవేరతాయని కేజ్రీవాల్ ఆశించారన్నారు. ఉజ్జయిని జిల్లాలో ఆర్యసమాజ్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అగ్నివేశ్ ఈ ఆరోపణలు చేశారు. 2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష సందర్భంగా హజారే చనిపోతే బావుండని కేజ్రీవాల్ కోరుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. హజారే ఆమరణ నిరాహారదీక్షను నిరవధిక నిరాహార దీక్షగా మార్చాలనే పార్టీ ప్రతిపాదనకు కేజ్రీవాల్ గట్టిగా అడ్డు తగిలారనీ, పైగా ఉద్యమం ఇపుడు త్యాగాలను కోరుతోందంటూ వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనమన్నారు. హజారే చనిపో్తే తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చనే కేజ్రీవాల్ దురుద్దేశం స్పష్టమవుతోందన్నారు. అయితే అప్పటి ప్రభుత్వం ఆయన డిమాండ్లకు అంగీకరించి, హజారే ఉద్యమాన్ని విరమింపజేసింది కానీ, లేకపోతే ఇంకో పది రోజులు హాజారే దీక్ష కొనసాగాలని కేజ్రీవాల్ కోరుకున్నారని స్వామి అగ్నివేశ్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలిపై తాను ఆనాడే యోగేంద్ర యాదవ్‌ని హెచ్చరించానన్నారు. ఢిల్లీలో మెజార్జీ సాధించి ప్రభుత్వాన్ని స్థాపించిన అనతికాలంలోనే ఆప్‌లో వివాదాలు రగులుకున్నాయి. అసంతృప్త నేతలమధ్య సయోధ్యకు చేసిన ప్రయత్నాలు ఫలించలేద. చివరకు ఆ నేతల బహిష్కరణకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
కేజ్రీవాల్ ఓ నియంత.. అందుకే చీలిక
ఇండోర్: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నియంత స్వభావం కలవారని సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ ఆరోపించారు. అందుకే ఆప్‌లో చీలికలు, వర్గ విభేదాలు అని, దీనికి కేజ్రీవాలే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఆయన నియంత స్వభావానికి తాను స్వయంగా సాక్షినని, ప్రత్యక్షంగా కేజ్రీవాల్ స్వభావం తెలుసుకున్నానని చెప్పారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఎవరినీ సంప్రదించడని, అసలు తన ముందు ఎవరినీ నిలవనివ్వడంగానీ, మాట్లాడనివ్వడం గానీ చేయనిచ్చేవాడు కాదని అన్నారు. ఇదంతా తాను అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో కలిసి పోరాడే ముందు గమనించానని చెప్పారు. గతంలోనే కేజ్రీవాల్ స్వభావాన్ని ప్రశాంత్ భూషణ్ కు హెచ్చరించినా ఆయన మౌనం పాటించారే తప్ప స్పందించలేదని, నేడు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హజారేను మరిన్ని రోజులు నిరాహార దీక్ష కొనసాగించాలని కేజ్రీవాల్ ఒత్తిడి చేసేవారని ఆరోపించారు. -
రైతుల కోసం జాతీయ స్థాయి ఉద్యమం
మార్చిలో మేధాపాట్కర్, అన్నాహజారేలను తీసుకొస్తాం సామాజిక వేత్త అగ్నివేశ్ ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటన సాక్షి, విజయవాడ బ్యూరో: కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం రైతు శ్రేయస్సును కాలరాస్తూ, రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల భూమిని లాక్కొనే చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పికొట్టేలా జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రముఖ సామాజిక వేత్త స్వామి అగ్నివేశ్ ప్రకటించారు. మార్చి రెండు లేదా మూడోవారంలో మేధాపాట్కర్ను, మార్చి చివరివారంలో అన్నా హజారేను రాజధాని ప్రతిపాదిత ప్రాంతానికి తీసుకొస్తామని రైతులకు ఆయన భరోసానిచ్చారు. గుంటూరు జిల్లా పెనుమాక, వెంకటపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో శుక్రవారం పర్యటించిన బృందానికి అగ్నివేశ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు ఎన్నికల్లో గెలుపుకోసం డబ్బులు ఖర్చుపెట్టిన కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు.టీడీపీ ప్రభుత్వం కోసం కేంద్రం తెచ్చిన భూ ఆర్డినెన్సును పార్లమెంటులో అడ్డుకోవాలని అన్ని పార్టీలనూ కోరుతున్నట్టు చెప్పారు. పొలాలు లాక్కునేందుకు వచ్చే వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అధికారం ప్రయోగిస్తున్నారు: సంధ్య చంద్రబాబు చేసే కుట్రలను రైతులు, కూలీలు, ప్రజలు సంఘటితంగా తిప్పికొట్టాలని ప్రగతి శీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య పిలుపునిచ్చారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని ప్రాంత రైతుల ప్రయోజనాలను కాపాడేలా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు చెప్పారు. బృందంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసి రాష్ట్ర నేత చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక కన్వీనర్ పి.రామకృష్ణంరాజు ఉన్నారు. పెట్టుబడిదారుల సేవలో ప్రభుత్వం విజయవాడ: ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తున్న ప్రభుత్వాధినేతలు పెట్టుబడిదారుల సేవలో నిమగ్నమయ్యారని స్వామి అగ్నివేశ్ నిప్పులు చెరిగారు. ల్యాండ్ పూలింగ్, భూసేకరణపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జరిగిన సదస్సులో అగ్నివేశ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాజధాని ప్రతిపాదిత తుళ్లూరులో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాన్ని విపక్ష పార్టీ అయిన వైఎస్సార్ సీపీపైకి నెట్టేయడం బాబు ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని అన్నారు. -
'చంద్రబాబు రియల్టర్ గా మారిపోయారు'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సామాజిక వేత్త స్వామి అగ్నివేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ రైతులు పొట్టగొట్టాలని బాబు చూస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే తరహాలో రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్నారు. శుక్రవారం గుంటూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ ఇద్దరి అంతిమ లక్ష్యం రైతుల పొట్టగొట్టడమేనని విమర్శించారు. చంద్రబాబు రియల్టర్ గా మారి పోయారని ఎద్దేవా చేశారు. ఆయన రియల్టర్ ముసుగులో బడాబాబులకు భూములు అప్పగించే యత్నం చేస్తున్నారన్నారు. వారి భాగస్వామ్య పక్షాలే పనితీరు నచ్చక వెనక్కి వెళుతున్నాయని మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఢిల్లీ ఫలితాలే ఇందుకు ఉదాహరణ అని ఆయన గుర్తు చేశారు. వచ్చే నెలలో అన్నా హజారే, మేథా పాట్కర్ లు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని అగ్నివేశ్ పేర్కొన్నారు. -
మతోన్మాదులకు అధికారమివ్వొద్దు
సామాజికతత్వవేత్త స్వామి అగ్నివేశ్ మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టి గద్దెనెక్కాలని కుట్రలుచేస్తున్న మతోన్మాదులకు అధికారం ఇవ్వొద్దని ప్రముఖ సామాజిక తత్వవేత్త స్వామి అగ్నివేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. లౌకిక ప్రజాతంత్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్‌నగర్‌లో మతోన్మాద వ్యతిరేక బహిరంగసభను నిర్వహిం చారు. ప్రధానవక్తగా పాల్గొన్న అగ్నివేశ్ మాట్లాడుతూ.. గుత్తాధిపత్యాన్ని చలాయించాలని మతోన్మాదశక్తులు, కార్పొరేట్ సంస్థలు నరహంతకుడైన నరేంద్రమోడీని అభివృద్ధి చేస్తాడని పొగుడుతున్నాయని విమర్శించారు. గుజరాత్ అభివృద్ధి బూటకమన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల ఆకలి తీరితేనే ప్రగతికి సార్ధకత చేకూరుతుందన్నారు. రాజకీయాలను మతంతో ముడిపెట్టి, మానవసంబంధాలను మట్టుబెట్టాలని చూస్తున్న దుర్మార్గపు పోకడల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీసీఐ కార్యదర్శి నారాయణ కోరారు. అధికారంలోకి రావడానికి ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీలు బేజేపీ అనే రాజకీయ ముసుగు తొడిగి హిందూత్వాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.