'చంద్రబాబు రియల్టర్ గా మారిపోయారు' | agnivesh slams chandra babu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు రియల్టర్ గా మారిపోయారు'

Published Fri, Feb 27 2015 6:48 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

'చంద్రబాబు రియల్టర్ గా మారిపోయారు' - Sakshi

'చంద్రబాబు రియల్టర్ గా మారిపోయారు'

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సామాజిక వేత్త స్వామి అగ్నివేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ రైతులు పొట్టగొట్టాలని బాబు చూస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే తరహాలో రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్నారు. శుక్రవారం గుంటూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ ఇద్దరి అంతిమ లక్ష్యం రైతుల పొట్టగొట్టడమేనని విమర్శించారు. చంద్రబాబు రియల్టర్ గా మారి పోయారని ఎద్దేవా చేశారు. ఆయన రియల్టర్ ముసుగులో బడాబాబులకు భూములు అప్పగించే యత్నం చేస్తున్నారన్నారు.

 

వారి భాగస్వామ్య పక్షాలే పనితీరు నచ్చక వెనక్కి వెళుతున్నాయని మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఢిల్లీ ఫలితాలే ఇందుకు ఉదాహరణ అని ఆయన గుర్తు చేశారు. వచ్చే నెలలో అన్నా హజారే, మేథా పాట్కర్ లు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని అగ్నివేశ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement