మతోన్మాదులకు అధికారమివ్వొద్దు
సామాజికతత్వవేత్త స్వామి అగ్నివేశ్
మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టి గద్దెనెక్కాలని కుట్రలుచేస్తున్న మతోన్మాదులకు అధికారం ఇవ్వొద్దని ప్రముఖ సామాజిక తత్వవేత్త స్వామి అగ్నివేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. లౌకిక ప్రజాతంత్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్‌నగర్‌లో మతోన్మాద వ్యతిరేక బహిరంగసభను నిర్వహిం చారు. ప్రధానవక్తగా పాల్గొన్న అగ్నివేశ్ మాట్లాడుతూ.. గుత్తాధిపత్యాన్ని చలాయించాలని మతోన్మాదశక్తులు, కార్పొరేట్ సంస్థలు నరహంతకుడైన నరేంద్రమోడీని అభివృద్ధి చేస్తాడని పొగుడుతున్నాయని విమర్శించారు. గుజరాత్ అభివృద్ధి బూటకమన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల ఆకలి తీరితేనే ప్రగతికి సార్ధకత చేకూరుతుందన్నారు. రాజకీయాలను మతంతో ముడిపెట్టి, మానవసంబంధాలను మట్టుబెట్టాలని చూస్తున్న దుర్మార్గపు పోకడల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీసీఐ కార్యదర్శి నారాయణ కోరారు. అధికారంలోకి రావడానికి ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీలు బేజేపీ అనే రాజకీయ ముసుగు తొడిగి హిందూత్వాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.