ప్రముఖ నటి, యాంకర్ హరితేజ మొదటి సారి తన చిన్నారిని పరిచయం చేసింది. పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..పాప రాకతో తమ వివాహ వార్షికోత్సవం మరింత ప్రత్యేకంగా మారిందని తెలిపింది. భర్త దీపక్‌తో కలిసి బిడ్డను ఎత్తుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా పలవురు బుల్లితెర ప్రముఖులు సహా నెటిజన్లు హరితేజకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఏప్రిల్ 5న హరితేజ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
బుల్లితెరపై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. తర్వాత యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ గుర్తింపుతో బిగ్‌బాస్ 1లోకి వెళ్లి తనదైన నటనతో బుల్లితెర ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది. 2015లో ఆమె వివాహం జరిగింది. రాజా ది గ్రేట్, హిట్, సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, అరవింద సమేత, యూటర్న్, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో హరితేజ నటించిన సంగతి తెలిసిందే.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: నటి సీమంతం వేడుక.. బేబీ బంప్‌తో డ్యాన్స్
మన శరీరం కేవలం అందుకోసమే కాదు కదా : రేణు దేశాయ్
Comments
Please login to add a commentAdd a comment